Guntur Karam: క్లైమాక్స్‌కి చేరుకున్న ‘మహేశ్ మూవీ’?
అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో 'గుంటూరు కారం' పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉన్న గుంటూరు కారం.. క్లైమాక్స్‌కి వచ్చినట్టుగా తెలుస్తోంది.
Guntur Karam: ప్రస్తుతం ఘట్టమనేని అభిమానులు.. దమ్ మసాలా బిర్యానీ సాంగ్‌ను రిపీట్ మోడ్‌లో వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా అదిరిపోయే మాస్ ట్రీట్ ఇస్తుందని పండగ చేసుకుంటున్నారు. తమన్ ట్యూన్‌తో పాటు సాంగ్‌లో మహేష్ బాబు మాస్ లుక్ చూసి ఫిదా అవుతున్నారు. యంగ్ బ్యూటీస్ శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను.. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ కానుంది. దీంతో.. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు త్రివిక్రమ్.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. సినిమా షూటింగ్ క్లైమాక్స్‌కి వచ్చేసినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ క్లైమాక్స్ షూట్‌కి రెడీ అవుతోందట. క్లైమాక్స్ కోసం దాదాపు 5 కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేశారట. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ అదిరిపోయే యాక్షన్ బ్లాక్‌ని డిజైన్ చేసాడట. దీంతో.. మొత్తంగా ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ సెకండ్ వీక్ వరకు కంప్లీట్ అవనుందని తెలుస్తోంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌పై ఫోకస్ చేయనున్నాడు త్రివిక్రమ్.
మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ప్రమోషన్స్ అయిపోగానే.. రాజమౌళి ప్రాజెక్ట్ కోసం ఫుల్ ఫ్లెడ్జ్‌గా రంగంలోకి దిగనున్నాడు. ఇప్పటికే జిమ్‌లో తెగ కసరత్తులు చేస్తున్నాడు సూపర్ స్టార్. అన్ని అనుకున్నట్టుగా జరిగితే.. డిసెంబర్లో స్క్రిప్టు లాక్ చేసి.. వచ్చే సమ్మర్లో ఎస్ఎస్ఎంబీ 29ని సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. ఒక్కసారి ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయితే రెండు, మూడేళ్లు లాక్ అవనున్నాడు మహేష్ బాబు. మరి గుంటూరు కారం ఎస్ఎస్ఎంబీ 29ని ఎలాంటి బూస్టింగ్ ఇస్తుందో చూడాలి.