కృష్ణా: తాడిగడప మున్సిపాలిటీ యనమలకుదురు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బడుగు మధుసూదన్ రావు మరణించాడు. పెనమలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి మధు పార్దివ దేహానికి పూల మాల వేసి, ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారి అంతిమ యాత్రలో పాల్గొని తన ప్రగాఢ సంతాపన్ని తెలియజేశారు.