ATP: ‘సుపరి పాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో రాంపురం గ్రామంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది విజయాలను వివరించారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. భవనం పెచ్చులూడుతోందని సిబ్బంది విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చారు.