BDK: ఖమ్మం జిల్లా డిప్యూటీ DMHO డాక్టర్ బి. సైదులుకు ఉద్యోగోన్నతి లభించింది. ఆయనను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ డీఎంహెచ్ఎగా నియమిస్తూ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ బి.రవీంద్రనాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ సైదులు ఖమ్మం జిల్లాలో సుదీర్ఘకాలం వివిధ విభాగాల ప్రోగ్రామ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించారు.