Kalki: ప్రభాస్ సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్‌కు హిట్ రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. త్వరలోనే సలార్ రెండో పార్ట్ కూడా రానుంది. అయితే.. దానికంటే ముందు కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకకు రానుంది. ప్రభాస్ కల్కి ప్రస్తుతం మోస్ట్ వెయిటింగ్ పాన్-ఇండియా సినిమా. భారీ బడ్జెట్ , అద్భుతమైన స్టార్ కాస్ట్‌తో పాటు, ఈ చిత్రం సాంకేతికత, ఇతిహాసాల కలయికగా రాబోతోంది.
ఈ చిత్రం క్లైమాక్స్ భారతీయ చలనచిత్రంలో మునుపెన్నడూ లేని గొప్ప దృశ్యంగా ఉండబోతుందని వినపడుతోంది. వచ్చే వారం నుంచి క్లైమాక్స్ షూట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. క్లైమాక్స్ షూట్లో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని, మరికొంత మంది తారలు పాల్గొంటారు. దుల్కర్, విజయ్ దేవరకొండ, నాని వంటి పవర్ ఫుల్ క్యామియో రోల్స్ ఉన్నాయి. కల్కి రెండు-భాగాలుగా తెరకెక్కుతుంది కాబట్టి కమల్ హాసన్ పాత్ర క్లైమాక్స్‌లో పరిచయం చేస్తారట. ఈ చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి అవతారంలో కనిపిస్తాడు అనే టాక్ వినిపిస్తుంది. ఇదే కాని నిజం అయితే క్లైమ్యాక్స్ ఓ రేంజ్లో ఉంటుందని అంచన.