రౌడీ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా 'ఖుషి'. సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్‌కు రెడీ అవుతోంది. కానీ ఇప్పటి వరకు బుకింగ్స్ ఓపెన్ అవలేదు. తాజాగా దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
Khushi: ఇప్పటికే ఖుషి ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. మ్యూజిక్ కాన్సర్ట్‌లో లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రమోషన్స్‌కు హైప్ ఇచ్చారు విజయ్, సమంత. ఆ తర్వాత రౌడీ ఇక్కడే ప్రమోషన్స్ చేస్తుండగా.. సమంత మాత్రం తన పార్ట్ ప్రమోషన్స్‌ని కంప్లీట్ చేసుకోని ట్రీట్మెంట్ కోసం న్యూయార్క్ వెళ్లిపోయింది. అక్కడ కూడా సామ్ ఖుషి ప్రమోషన్స్ చేసింది. ఇక ఈ సినిమా సాంగ్స్ చాలా ముందే రిలీజ్ చేయగా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ట్రైలర్ కూడా ఈ సినిమా మినిమం గ్యారెంటి అనేలా బజ్ క్రియేట్ చేసింది. రీసెంట్గా ‘ఓసి పెళ్లామా’ అంటూ సాగే 5వ పాటని రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా ఖుషి ప్రమోషన్స్‌ని పరుగులు పెట్టిస్తున్న మేకర్స్.. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఓపెన్ చేయలేదు.
ఖుషి రిలీజ్‌కు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. అయినా కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా తెరవలేదు. అయితే ఈ సినిమా బిజినెస్ అండ్ ఏరియా వారీగా ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయట. అడ్వాన్స్ బుకింగ్‌లను ఆలస్యం చేయడం వల్ల సినిమాపై అంచనాలు పెరుగుతాయని.. బుకింగ్‌లు అందుబాటులోకి వచ్చిన వెంటనే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అందుకే బుకింగ్స్ లేట్ చేసినట్టు తెలుస్తోంది. ఫైనల్‌గా ఈ సినిమా రిలీజ్‌కు రెండు రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్స్ చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 1వ తేదీన ఖుషి రిలీజ్ ఉండగా.. ఆగష్టు 30వ తేదీన ఉదయం పది గంటలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయనున్నారు. ఈ విషయాన్ని చెబుతూ అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. మరి ఖుషి ఎలా ఉంటుందో చూడాలి.