ఆగస్టు 15న ఖుఫీ మూవీ మ్యూజికల్ కాన్సెర్ట్ జరిగింది. ఈ వేడుకలో భాగంగా హీరోయిన్ సమంత, హీరో విజయ్ దేవరకొండ స్టేజ్‌పై లైవ్ పర్ఫార్మెన్స్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. హద్దులు దాటి డ్యాన్స్ చేశారని ట్రోల్స్ చేస్తున్నారు.
Khushi movie musical concert.. Vijaya Devarakonda and Samantha trolled badly
Khushi: లవ్ రొమాంటిక్ సినిమాలను తెరకెక్కించే శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఖుషి(Khushi). ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన కొన్ని పాటలు, ట్రైలర్ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్(Hesham Abdul Wahab) మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా ఆగస్టు 15న మ్యూజికల్ కాన్సెర్ట్‌ను నిర్వహించారు చిత్ర యూనిట్. దీనిలో ఖుషి సినిమా సాంగ్స్ ని లైవ్ లో పర్ఫార్మ్ చేశారు. ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ లో మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహిబ్, సిద్ శ్రీరామ్(Sid Sriram), జావేద్ అలీ, అనురాగ్ కులకర్ణి, హరిచారం, చిన్మయి లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
ఖుషి సాంగ్స్ కి విజయ్ దేవరకొండ, సమంత కలిసి స్టేజి మీద డ్యాన్స్ వేశారు. అయితే ఇక్కడే ట్రోల్స్ మొదలయ్యాయి. మామూలుగా హీరోహీరోయిన్స్ చాలా సందర్భాల్లో కలిసి డ్యాన్స్ చేస్తుంటారు. ఇందులో వింతేముంది. కానీ ఈ ఈవెంట్లో విజయ్ షర్ట్ తీసేసి సమంతని ఎత్తుకొని చుట్టూ తిప్పుతూ హడావిడి చేస్తూ డ్యాన్స్ చేయడం నెటిజన్లకు స్టఫ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు వైరల్ గా మారాయి. వీరు హీరో హీరోయిన్స్ లా కాకుండా స్టేజ్ పెర్ఫార్మర్లుగా డ్యాన్స్ చేశారని, విజయ్ షర్ట్ ఎందుకు ఇప్పడం అని, ఇది మ్యూజికల్ కాన్సర్టేనా.. వాళ్ళ డ్రెస్సింగ్ పై కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒక రకంగా సమంత అభిమానులు హర్ట్ అయినట్లు కనిపిస్తున్నారు. అయితే విజయ్ అంటేనే ఎనర్జీకి మారుపేరు ఈ మాత్రం ఉంటుందని మరికొందరు అంటున్నారు. లైగర్ సినిమాతో సైలెంట్ అయ్యాడన్న కామెంట్స్‌కు ధీటుగా ఈ వేడుకతో సమాధానం ఇచ్చాడు విజయ్. సెప్టెంబర్ 1న సినిమా విడుదల అవుతుండడంతో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.