Na Samiranga.. Nag will give a 'king' size comeback?
Nag: క్లాస్, మాస్, భక్తి ఇలా అన్నిజానర్లలో సినిమాలు చేసి మెప్పించిన నాగార్జున (Nagarjuna).. 2023 ఆగష్టు 29న 64వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నాడు. ఇప్పటి వరకు నాగ్ 98 సినిమాలు చేసాడు. ప్రేమ కథ చిత్రాలే కాదు.. అన్నమయ్య లాంటి సినిమాలు కూడా తీశాడు. విక్రమ్ నుంచి మజ్ను, ఆఖరి పోరాటం, విక్కీ దాదా, గీతాంజలి, శివ, అల్లరి అల్లుడు, హలో బ్రదర్, క్రిమినల్, ఘరానా బుల్లోడు, సిసింద్రీ, నిన్నే పెళ్లాడతా, అన్నమయ్య, నువ్వు వస్తావని, సంతోషం, మన్మథుడు, శివమణి, మాస్, కింగ్, రగడ, శ్రీ రామదాస్, మనం, సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి లాంటి ఐకానిక్ సినిమాలు చేశాడు.
ఆయా సినిమాలు నాగార్జునను టాప్ హీరోగా నిలబెట్టాయి. ఇప్పుడున్న టాప్ మోస్ట్ డైరెక్టర్స్ అందరినీ ఇన్స్పైర్ చేసిన రామ్ గోపాల్ వర్మలోని టాలెంట్‌ని గుర్తించి, శివ సినిమాతో అతనికి మొదటి అవకాశం ఇచ్చాడు. ఎంతో మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. మూడున్నర దశాబ్దాల సినిమా కెరీర్లో దాదాపు 42 మంది కొత్త దర్శకులని ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేశాడు. బర్త్ డే సందర్భంగా అనౌన్స్ అయిన 99వ సినిమాతో 43వ కొత్త దర్శకుడిని తీసుకొచ్చాడు.
నా సామిరంగ టైటిల్‌తో అనౌన్స్ అయిన సినిమాలో.. కొరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ మెగాఫోన్ పడుతున్నాడు. గత కొంత కాలంగా ఏ మాత్రం మెప్పించలేకపోతున్నాడు నాగ్. వైల్డ్ డాగ్, మన్మధుడు 2, ఘోస్ట్ లాంటి సినిమాలతో విమర్శలను ఎదుర్కొన్నాడు. సరైన స్క్రిప్టు ఎంచుకోవడం నాగ్ వెనకబడిపోయాడనే టాక్ ఉంది. ఈ విషయంలో అక్కినేని అభిమానులు నిరాశగా ఉన్నారు. లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘నా సామీ రంగ’తో కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్ప్స్ ఊరమాస్‌గా ఉంది. ఈ సినిమాను సంక్రాంతి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా.. కింగ్ నాగార్జున మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.