»Bengaluru Jersey Controversy Jailer Movie Team Will Remove Scene
Jailer: వివాదంలో జైలర్.. ఆ సీన్ తొలగిస్తాం: మూవీ టీమ్
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం కలెక్షన్ల పరంగా ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో తెలుసు. ఆ సినిమాలో ఆర్సీబీ జెర్సీ వేసుకున్న సీన్‌పై క్రికెటర్స్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
Bengaluru Jersey Controversy.. Jailer Movie Team Will Remove Scene
Jailer: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) మాస్ హిట్ అందుకున్న తాజా చిత్రం జైలర్ (Jailer). నెల్సన్ దిలీప్‌కుమార్ (Dilip Kumar) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన బాక్స్ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ మూవీ ఓ వివాదంలో చిక్కుకుంది. ఇందులో ఓ సన్నివేశంలో ఆర్సీబీ జెర్సీని (RCB jersey) ధరించిన ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌ను రజనీకాంత్ చంపేస్తాడు. దీనిపై సదరు క్రికెట్ టీమ్ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేసి.. కోర్టులో పిటిషన్ వేయడంతో విచారించిన మెజిస్ట్రేట్ కీలక తీర్పు ఇచ్చారు. వెంటనే ఆ సన్నివేశంలో మార్పులు చేస్తామని చిత్రబృందం హామీ ఇచ్చింది.
సినిమాలో తన మనవడిని చంపే ప్రయత్నాన్ని ఛేదించిన రజనీకాంత్ ఓ సన్నివేశంలో ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్స్ హెళన చేస్తారు. అలాగే తన కోడలి గురించి అసభ్యకరంగా మాట్లాడుతుంటారు. దీంతో రజనీ ఒక విలన్ తల నరుకుతాడు. ఇంకో విలన్ ఆర్సీబీ జెర్సీలో ఉంటాడు. అతన్ని షూట్ చేస్తాడు. అసలు సమస్య ఇక్కడే వచ్చింది. ఆ డ్రెస్ ధరించిన వ్యక్తి విలన్ అవడం, పైగా అతన్ని హీరో హతమార్చడంతో తమ అనుమతి లేకుండా జెర్సీని నెగెటివ్‌గా ఉపయోగించారని ఆ టీమ్ నిర్వాహకులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టింది. కోర్టు బయటే ఈ అంశాన్ని పరిష్కారం చేసుకునేందుకు ఇరువర్గాలు అంగీకరించాయి. సెప్టెంబర్ 1వ తేదీలోపు ఆ సన్నివేశంలో మార్పులు చేస్తామని చిత్ర బృందం కోర్టుకు వెల్లడించింది. టెలివిజన్, ఓటీటీల్లో మార్చిన సన్నివేశాలను ప్రదర్శిస్తామని హామీ ఇచ్చింది. సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత ఆ సన్నివేశం ఉండకూడదని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొనడంతో వివాధానికి తెరపడింది.
ఆగస్టు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్.. ఇప్పటి వరకు రూ.600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. పాన్ ఇండియా చిత్రంగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా రజనీకాంత్ సత్తా ఏంటో తెలిపింది. ఈ విజయంతో సూపర్‌స్టార్ అభిమానులు పండుగ చేసుకున్నారు. తమిళనాడులోనే సినిమా రూ. 175 కోట్లకు పైగా వసుళ్లు చేసింది. మూవీ విజయంలో మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్ కీ రోల్ పోషించారు.