»Non Bailable Warrant Issued By Name Of Rk Selvamani
Minister రోజా భర్తపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
ఏపీ మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణికి చెన్నై జార్జ్ టౌన్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. పరువునష్టం కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో ఇష్యూ చేసింది.
Non Bailable Warrant Issued By Name Of RK Selvamani
RK Selvamani: ఏపీ మంత్రి, సినీనటి రోజా భర్త ఆర్కే సెల్వమణిపై (RK Selvamani) చెన్నై జార్జ్ టౌన్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. పరువు నష్టం కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో ఈ మేరకు ఇష్యూ చేసింది. ఆర్కే సెల్వమణి (RK Selvamani) సినీ దర్శకుడు అనే సంగతి తెలిసిందే. ఓ కేసులో ముకుంద్ చంద్ బోత్రా అనే ఫైనాన్షియర్ అరెస్ట్ అయ్యాడు. అతను 2016లో అరెస్ట్ కాగా.. ముకుంద్ వల్ల తాను ఇబ్బంది పడ్డానని సెల్వమణి ఓ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పాడు.
సెల్వమణి (RK Selvamani) చేసిన కామెంట్లతో తన పరువుకు భంగం కలిగిందని ముకుంద్ కేసు దాఖలు చేశారు. తర్వాత ముకుంద్ చనిపోయారు. కానీ అతని కుమారుడు గగన్ బోత్రా కేసును కొనసాగిస్తున్నాడు. పరువు నష్టం కేసులో సోమవారం విజారణ జరిగింది. ఆ విచారణకు సెల్వమణి హాజరుకాలేదు. దీంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. ఆర్కే సెల్వమణి (RK Selvamani) మంచి అభిరుచి గల దర్శకుడు. దుర్గా సినిమా సమయంలోనే రోజాతో ప్రేమలో పడి.. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. రోజా దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్స్‌తో మంచి పేరు తెచ్చుకున్నారు రోజా. మంత్రి అయిన తర్వాత ఆమె దూరం అయ్యారు.