షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసిన జవాన్ సినిమాపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అతని చివరి చిత్రం పఠాన్ అద్భుతమైన విజయం తర్వాత మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది. షారుఖ్ ఖాన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం జవాన్ సెప్టెంబర్ 7న విడుదలకు సిద్ధమవుతోంది.
జవాన్ మూవీ ట్రైలర్ గురువారం విడుదలైంది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ప్రీ బుక్సింగ్ ని ఎగపడి కొంటున్నారు. టిక్కెట్లు విక్రయించిన 24 గంటల్లోనే శుక్రవారం నాటికి ఈ చిత్రం రూ.6.84 కోట్ల విలువైన 2,00,454 టిక్కెట్లను విక్రయించింది. జవాన్ హిందీ వెర్షన్ ఇప్పటికే నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NRC)లో రూ.1.12 కోట్లు వసూలు చేసింది. ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరులో రూ.50-65 లక్షల వరకు వసూలు చేసింది.
జవాన్ (తమిళ వెర్షన్) కోసం అడ్వాన్స్ బుకింగ్ కొంచెం తక్కువగా ఉంది. చిత్రం 3,365 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. జవాన్ తెలుగు వెర్షన్ కోసం 1,097 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. షారుఖ్ పఠాన్ అదే సమయంలో దాదాపు 1,71,500 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. జవాన్ ప్రారంభ రోజు 24 గంటల్లో సుమారు 3 లక్షల టిక్కెట్లు అమ్ముడవుతాయని అంచనా. అట్లీ దర్శకత్వంలో రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ జవాన్‌ను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్నారు. ఎస్ఆర్కే కెరీర్లోనే అత్యంత ఖరీదైన సినిమా జవాన్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం భారీ ఓపెనింగ్‌ను అందించడానికి సిద్ధంగా ఉంది. మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుండగా, మందు నుంచే ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి.