రన్బీర్ కపూర్, అలియాభట్ జంటగా నాగార్జున, అమితాబ్ వంటి తారలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. వచ్చేవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే… ఈ సినిమా ఈవెంట్ లో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగాస్టార్ చిరంజీవికి కౌంటర్ గా తారక్ ఇలాంటి కామెంట్స్ చేశాడంటూ ప్రచారం జరుగుతోంది.
ప్రపంచ సినిమా ప్రస్తుతం ఒత్తిడికి గురవుతుంది అన్నారు. ఆడియన్స్ కొత్తగా ఏదో కోరుకుంటున్నారని.. దాని వల్లే ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్నారు. వారికి ఇంకా ఏదో కావాలి అని కోరుకుంటున్నారు. ఇది నమ్ముతూ.. ఆ ఒత్తిడిని తట్టుకుని నా వరకు నేను ఇంకా బాగా నటించేందుకు ప్రయత్నం చేస్తాను అన్నారు తారక్. అంతే కాదు ఇది ఒక ఛాలెంట్ గా తీసుకుని ఫిల్మ్ ఇండస్ట్రీ కష్టపడాల్సిన అవసరం ఉంది అన్నారు. అందుకే ఈ ఒత్తిడి మంచిదే… దీని వల్ల మంచి సినిమాలు బయటకు వస్తాయన్నారు తారక్.
అయితే ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యులు మెగాస్టార్ చిరంజీవికి కౌంటర్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత చిరు ఇన్ డైరెక్ట్ గా కొరటాలపై ఘాటు విమర్శలు చేశారు.ఈ కౌంటర్లకు తారక్ ఇలా ప్రతి కౌంటర్ ఇచ్చాడని… కొరటాల శివకు అండగా నిలిచాడంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఆ విషయం తారక్ చెప్పనప్పటికీ… నెటిజన్లు అలా భావిస్తూ.. దానికీ..దీనికీ లింక్ పెడుతుండటం గమనార్హం.