Japan Movie: తమిళ హీరో సూర్య (Surya) తమ్ముడిగా కెరీర్ మొదలుపెట్టాడు కార్తీ (kaarthi). తన అన్న ఛాయలు ఏమాత్రం కెరీర్ పై పడకుండా జాగ్రత్తగా వెళ్తున్నాడు. ఎప్పడూ ఒకేలాంటి మూస సినిమాలు చేయడం అతనికి నచ్చదు. ప్రతిసారీ డిఫరెంట్ కథతో మన ముందుకు వస్తూ ఉంటాడు. ఆయన పేరుకు తమిళ హీరో (tamil hero) అయినా, తెలుగులో కూడా మార్కెట్ అంతే ఉంది. డైరెక్ట్ గా తెలుగు సినిమా తీసి కూడా హిట్ కొట్ట గల సత్తా ఉంది. ఇటీవల పొన్నియన్ సెల్వన్ మూవీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జపాన్ (japan) అనే సినిమాతో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు.
జపాన్ మూవీని (japan movie) దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని మూవీ టీమ్ ఓ ప్రకటన చేసింది. కార్తీ పుట్టిన రోజు సందర్భంగా జపాన్ వీడియోని (video) కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో హీరో ఎంట్రీని విజయ్ దేవరకొండతో (vijaya devarakonda) చెప్పించడం విశేషం.ఆ వీడియోలో కార్తీ పోషించిన జపాన్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. భగవంతుని అద్భుత సృష్టిలో తాను హీరో అని మూవీ టీమ్ ప్రతినిధులు చెప్పారు. మరో పాత్ర తాను కమెడియన్ అని, సునీల్ ప్రమాదకరమైన విలన్ అని చెప్పారు. తర్వాత యాక్షన్ పార్ట్ మొదలవుతుంది, జివి ప్రకాష్ కుమార్ తన బిజిఎమ్‌తో చక్కగా ఎలివేట్ చేశాడు. ప్రతి సినిమాకి తగినంత వేరియేషన్ చూపించే కార్తీ, ఈ పరిచయ వీడియోలో విభిన్న అవతార్‌లో అద్భుతంగా కనిపిస్తున్నాడు. అతని బాడీ లాంగ్వేజ్ చాలా కూల్‌గా కనిపిస్తుంది. అతను హాస్యంతో కూడిన గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నట్లు అనిపిస్తుంది.
రాజు మురుగన్ (Raju murugan) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించింది. సునీల్, విజయ్ మిల్టన్ కీ రోల్స్ పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు అపాన్ మూవీని నిర్మిస్తున్నారు.