Janhvi Kapoor: డెనిమ్ లుక్ లో జాన్వీ క్యూట్ ఫోజులు..!
దివంగత నటి శ్రీదేవి ఇద్దరు కూతుళ్లలో ఒకరైన జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే టాలీవుడ్‌కు పరిచయం కానుంది. ఈ బ్యూటీ సిసిమాలతో ఎంతో బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటుంది. తన ఫ్యాన్స్ కి సంతోషపరచడానికి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
జాన్వీ(Janhvi Kapoor) మరోసారి తన ఫోటోలు షేర్ చేసింది. అందులో ఆమె డెనిమ్ లుక్ (Denim Look)లో కనిపించడం విశేషం. డెనిమ్ షర్ట్ కి, డెనిమ్ షార్ట్ పెయిర్ చేసింది. ఈ లుక్ లో ఆమె చాలా క్యూట్ గా కనపడుతోంది. ఈ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకంటున్నాయి.
ఇదిలా ఉండగా, త్వరలోనే జాన్వీ(Janhvi Kapoor) తెలుగులో గ్రాండ్ లాంఛ్ అవ్వబోతోంది. తెలుగులో ఎన్టీఆర్(NTR) సరసన ఆయన 30వ సినిమా దేవర (Devara Movie)లో నటిస్తోంది. ఈ మూవీకి దేవర అనే టైటిల్ ని ఖారారు చేశారు. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇటీవల జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ లో జాన్వీ చాలా కొత్తగా కనిపించింది. లంగా ఓణీలో చాలా అందంగా కనిపించింది. మరి మూవీలో ఎలా ఉంటుందా అనే ఆసక్తి మొదలైంది.
కాగా, ఈ బ్యూటీ చేయడానికి బాలీవుడ్ లో చాలా సినిమాలు చేసినా, చెప్పుకోదగిన హిట్ పెద్దగా ఏమీ లేవు. ఫలితం తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతోంది. ఎక్కువగా ఓటీటీలో జాన్వీ(Janhvi Kapoor) సినిమాలు విడుదలయ్యాయి. ఫలితం ఎలా ఉన్నా జాన్వీ నటనకు మాత్రం ప్రశంసలు దక్కతున్నాయి.