»Mahesh Will Not Be Available To Fans On His Birthday
Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్ కి ఇది నిజంగా బ్యాడ్ న్యూసే..!
సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ మూవీ చాలా కాలంగా వివాదాస్పద వార్తలతోనే వార్తల్లో నిలుస్తోంది. హీరోయిన్ మారిపోవడం, మ్యూజిక్ డైరెక్టర్ పై విమర్శలు, డైరెక్టర్ పై ట్రోల్స్ ఇలానే చాలానే జరిగాయి. మధ్యలో సినిమా ఆగిపోయిందంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే అంతా సర్దుకుపోయి ఎలాంటి బ్రేక్‌లు లేకుండా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల అల్యూమినియం ఫ్యాక్టరీలో చేశారు.
‘గుంటూరు కారం’ సినిమాలో కీలకమైన టాకీ పార్ట్‌ని చిత్రీకరించేందుకు త్రివిక్రమ్ ఊపందుకున్నాడట. నెలాఖరు వరకు కొనసాగుతున్న ఈ షెడ్యూల్లో మహేష్‌పై చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అయితే ఈ నెలాఖరు నుంచి మహేష్ సెలవుపై వెళ్లనున్నారు. ఆగస్ట్ 14న మహేష్ వెకేషన్ నుంచి తిరిగి రానున్నారు. ఇంతలో, గుంటూరు కారం షూటింగ్ ఇతర ప్రధాన తారాగణంపై చిత్రీకరణ సన్నివేశాలతో ముందుకు సాగుతుంది. దీనికి సంబంధించి హీరో, దర్శకుడి మధ్య చర్చలు జరిగాయి.
అనుకున్న సమయానికి సినిమాను ముగించి, సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనే విషయంలో మహేష్ చాలా క్లియర్ గా ఉన్నాడు. మహేష్ ఈ నెలాఖరులో సెలవుపై వెళ్లి ఆగస్టు 14న తిరిగి వస్తాడు. తన పుట్టినరోజు (ఆగస్టు 9న) అభిమానులకు అందుబాటులో ఉండడు. ఇది నిజంగా ఫ్యాన్స్ కి బాడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే సూపర్ ఫ్యాన్స్ తమ అభిమాన తార పుట్టినరోజును సోషల్ మీడియాలో జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. మహేష్ పుట్టినరోజును బిజినెస్మెన్ రీ-రిలీజ్‌తో జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.