అవతార్ సృష్టికర్త, వరల్డ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెర్మినేటర్, టైటానిక్, అవతార్.. లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించాడు కామెరూన్. ముఖ్యంగా అవతార్ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది. దాంతో అవతార్ సీక్వెల్ కోసం యావత్ ప్రపంచం ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. డిసెంబర్ 16న ‘అవతార్.. ది వే ఆఫ్ వాటర్’ రీలిజ్ కానుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 23న ‘అవతార్’ మూవీని రీ రిలీజ్ కూడా చేస్తున్నారు. దాంతో అవతార్ 2 పై మరింత హైప్ క్రియేట్ అవనుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో.. ఓ ఇంటర్వ్యూలో అవతార్ కోసం తను పడిన కష్టాన్ని చెప్పుకొచ్చాడు ఈ దర్శక దిగ్గజం.
మామూలుగా సినిమా నిడివి ఎక్కువగా ఉంటే.. ట్రిమ్ చేసేందుకే మొగ్గు చూపుతుంటారు ఫిల్మ్ మేకర్స్. అయితే డైరెక్టర్స్ మాత్రం అందుకు సిద్దంగా ఉండరు. తాము ఎంతో కష్టపడి తీసిన సీన్స్ ఎడిటింగ్ టేబుల్ దగ్గరే ఉండిపోవడానికి ఇష్టపడరు. ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు జేమ్ కామెరూన్. అవతార్‌లో కొన్నిసీన్స్ కోసం నిర్మాతలతో పెద్ద యుద్దమే చేయాల్సి వచ్చిందన్నారు. టైటానిక్ లాంటి సినిమా తీయకపోతే.. ఈ రోజు 4 వేల కోట్ల విలువైన స్టూడియో కాంప్లెక్స్ ఉండేవా.. ఆ విషయాన్ని మార్చిపోయారా.. అని నిర్మాతల్ని హెచ్చరించారట. దాంతో ఆ తర్వాత వాళ్లు సహకరించారని.. చెప్పుకొచ్చారు కామేరూన్. ఏదేమైనా కామెరూన్ లాంటి వాళ్లకు కూడా ఇలాంటి పరిస్థితి రావడం ఆశ్చర్యంగానే ఉందని అంటున్నారు.