»Jabardasth Avinash Tragedy Actor Jabardasth Who Lost A Child
Jabardasth Avinash: విషాదం.. బిడ్డను కోల్పోయిన జబర్దస్త్ నటుడు
జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన ముక్కు అవినాష్ ఇంట్లో విషాదం జరిగింది. పలు కారణాల వల్ల తన భార్య అనూజ అబార్షన్ జరిగిందని బాధ పడుతూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
Jabardasth Avinash: ముక్కు అవినాష్ జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. బిగ్బాస్ తర్వాత అవినాష్ పలు షోష్తో చాలా బిజీగా ఉంటున్నాడు. అయితే త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు భార్య అనూజతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తాజాగా అవినాష్ తన భార్యకు అబార్షన్ అయ్యిందని.. తమ బిడ్డను కోల్పోయినట్లు ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
నా లైఫ్లో సంతోషమైన, బాధ అయినా… నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటివరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాను. మేము అమ్మనాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డనీ కొల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. అంత తొందరగ మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలీ అన్న బాధ్యతతో ఈ విషయాన్నీ మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకీ థాంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్. అంటూ అవినాష్ రాసుకోచ్చాడు.