ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ తన ఆశయం గురించి తెలిపారు. అంతర్జాతీయ వన్డే, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వార్నర్.. భవిష్యత్తులో కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలని ఉందని తెలిపారు.
David Warner: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ వన్డే, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే డేవిడ్ వార్నర్‌కు ప్రస్తుతం టీ20లకు అందుబాటులో ఉన్నారు. ఇతనికి ఓ ఆశయం ఉందట. భవిష్యత్తులో క్రికెట్ నుంచి పూర్తిగా దూరమైతే కోచింగ్ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తాడట. కోచ్‌గా రాణించగలననే నమ్మకం డేవిడ్‌కి ఉందట. భవిష్యత్తులో అతని ఆశయం కూడా అదేనట. దీని గురించి ఇప్పటికే తన భార్యతో చర్చించారట. ఏడాదిలో కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి ఉంటుందని చెప్పానని వార్నర్ తెలిపారు.
తన కెరీర్లో ఎప్పుడూ ఎవరికీ ఇబ్బంది కలిగించలేదని అనుకుంటున్నాను. ఆట కోసం తీవ్రంగా శ్రమించా.. జట్టు కోసం నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించా. ఒకవేళ మళ్లీ గతం రిపీట్ చేసుకుంటే ఇంకాస్త ఓపికగా ఉండేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. కెరీర్ ప్రారంభంలో చాలా కోపంగా ఉండేవాడట. రోజులతో పాటు తనలో కూడా మార్పులు చేసుకున్నానని తెలిపారు. జట్టులో నా పాత్ర ఏంటనేది స్పష్టంగా తెలుసు. బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు ప్రత్యర్థి బౌలింగ్‌పై విరుచుకుపడటం చాలా ముఖ్యమని తెలిపారు. ఎవరికైనా తొలిసారి కలిగిన అభిప్రాయం త్వరగా మారదని వార్నర్ తెలిపారు.