లైగర్ సినిమా రౌడీ హీరో విజయ్ దేవరకొండకు భారీ దెబ్బేసింది. ఇక ఈ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత.. తదుపరి చిత్రాల విషయంలో డైలమాలో ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఎలాంటి సబ్జెక్ట్ ఎంచుకోవాలి.. ఏ దర్శకుడితో చేయాలి.. అని కన్ఫ్యూజన్ అవుతున్నాడట రౌడీ. ఇప్పటికే పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ నుంచి తప్పుకున్నాడు..
ప్రస్తుతుం శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి ‘ఖుషి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రౌడీ ప్రాజెక్ట్ ఏంటనేది క్లారిటీ రావడం లేదు. వాస్తవానికి మన లెక్క మాస్టారు సుకుమార్‌తో ఎప్పుడో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు విజయ్. కానీ ప్రస్తుతం సుక్కు ‘పుష్ప2’తో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ కష్టమే. కానీ విజయ్‌తో సినిమాలు చేయడానికి హరీష్ శంకర్, పరశురామ్, గౌతమ్ తిన్ననూరి లాంటి దర్శకులు లైన్లో ఉన్నారు.
అలాగే క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో కూడా సినిమా ఉంటుందనే టాక్ నడిచింది. అయితే వీరిలో ముందుగా గౌతమ్ తిన్ననూరితోనే సినిమా చేయబోతున్నాడట రౌడీ. ఇప్పటికే రామ్ చరణ్‌తో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడంతో.. హిట్ కోసం తపిస్తున్నాడు గౌతమ్. పైగా హిందీ ‘జెర్సీ’ ఆకట్టుకోకపోవడంతో.. రౌడీ కోసం కొత్త కథతో రెడీ అవుతున్నాడట.
వీలైనంత త్వరగా ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోందని తెలుస్తోంది. మరి గౌతమ్ తిన్ననూరి.. విజయ్‌తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.