Ileana D’Cruz: తనకు పుట్టబోయే బేబీకి తండ్రెవరో చెప్పిన ఇలియానా!
ఎట్టకేలకు ఇలియానా తనకు పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరో చూపించింది. చాలా రోజుల నుంచి ఇలియానా బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇప్పటికి ఇలియానా తన లవర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఒకప్పుడు టాలీవుడ్(Tollywood)ను ఏలిన టాప్ హీరోయిన్ ఇలియానా(Ileana D’Cruz) బాలీవుడ్లో సెటిల్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు అవకాశాలు లేవు. అయితే ఆమె తన ప్రెగ్నెన్సీ గురించి చెప్పినప్పటి నుంచి వరుసగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఇలియానా ఎప్పటికప్పుడు తన బేబీ బంప్ ఫోటోలను తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. అయితే పెళ్లి కాకుండానే తల్లి అవుతున్నావంటూ నెట్టింట ఆమెకు విమర్శలు ఎక్కువయ్యాయి. అయినప్పటికీ తన బాయ్ ఫ్రెండ్ ఎవరో ఇంత వరకూ రివీల్ చేయలేదు.
ఆ మధ్య తన లవర్ ఫేస్ కనిపించకుండా ఫోటోలను షేర్ చేసింది. దీంతో ఆమె(Ileana D’Cruz) భర్త ఎవరై ఉంటారనే సందేహం అందరిలోనూ ఉంది. దానిపై నెట్టింట విస్తృతంగా చర్చలు కూడా సాగాయి. చాలా మంది పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ మిస్టరీ మ్యాన్ గురించి ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు.
తాజాగా ఇలియానా(Ileana D’Cruz) అందరి సందేహాలకు తెరదించారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్(Instagram stories)లో తన జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి ముఖాన్ని రివీల్ చేస్తూ పోస్టు చేసింది. బ్లాక్ షర్ట్ ధరించి, గడ్డంతో ఉన్న వ్యక్తి ఫోటోలను ఇలియానా తన అభిమానులతో పంచుకుంది. అయితే అతని గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. ప్రస్తుతం ఇలియానా పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.