»This Week Ten Movies Will Be Released In Theaters
Movie Release: ఈ వారం థియేటర్లో విడుదలకు ఏకంగా పది సినిమాలు
ప్రతి శుక్రవారంలానే ఈ వారం కూడా సినిమా ప్రేమికులను అలరించడానికి కొత్త సినిమాలు ముస్తాబు అవుతున్నాయి. అయితే ఈ వారం పది మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయబోతున్నాయి.
This week, ten movies will be released in theaters
Movie Release: ప్రతి శుక్రవారంలానే ఈ వారం కూడా సినిమా ప్రేమికులను అలరించడానికి కొత్త సినిమాలు ముస్తాబు అవుతున్నాయి. అయితే ఈ వారం పది సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయబోతున్నాయి. మరి అవెంటో చూద్దామా..
హిడింబ
అశ్విన్ బాబు(Ashwin Babu), నందీత స్వేత(Nandita Swetha) జంటగా నటించిన చిత్రం హిడింబ(Hidimbha). గంగపట్నం శ్రీధర్ నిర్మాతగా, కన్నెగంటి అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 20న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. భారతీయ సినిమా చరిత్రలో ఎవరు టచ్ చేయలేని సరికొత్త పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఇప్పటికే విడుదలన అన్ని ప్రచార వీడియోలు ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. ఇక సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
అన్నపూర్ణ ఫోటో స్టూడియో
చైతన్య రావ్(Chaithanya Rao), లావణ్య(Lavanya) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం అన్నపూర్ణ ఫొటో స్టూడియో (Annapurna Photo Studio). యష్ రంగినేని నిర్మాతగా చెందు ముద్దు తెరకెక్కిస్తున్నారు. ఒక మంచి కథను ఆసక్తికర కథనంతో, అందమైన లొకేషన్స్‌తో, ఆకట్టుకునే మ్యూజిక్‌తో తెరకెక్కించాం. కథ 90వ దశకంలో సాగుతుంది. ఇప్పుడొస్తున్న చిత్రాలతో పోలిస్తే కచ్చితంగా భిన్నంగా ఉంటుంది అని చిత్ర బృంద తెలిపింది. ఈ చిత్రం జులై 21న థియేటర్లో విడుదలకు సిద్ధం అయింది.
హత్య
బిచ్చగాడుతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన నటుడు విజయ్ ఆంటోని(Vijay Antoni) నటించిన తాజా చిత్రం హత్య(Hathya). ఈ చిత్రాన్ని బాలాజీ కుమార్ తెరకెక్కించారు. రితికా సింగ్, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఈ నెల 21న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా దీన్ని తీర్చిదిద్దారని తెలస్తోంది.
ఓపెన్‌హైమర్
ప్రపంచం మొత్తం ఎదురుచూస్తొన్న చిత్రం ఓపెన్‌హైమర్(Oppenheimer). హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్(Christopher Nolan) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రముఖ భౌతికశాస్త్ర నిపుణుడు, అణుబాంబు సృష్టికర్తగా పేరుగాంచిన జె. రాబర్ట్(J. Robert Oppenheimer) ఒప్పెన్ హైమర్ జీవిత కథ ఆధారంగా తీర్చిదిద్దారు. రెండో ప్రపంచ యుద్ధ(2nd world war) కాలం నాటి కథతో ఈ మూవీని రూపోందించారు. ఇంత పెద్ద మూవీలో వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉపయోగించకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జులై 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హెర్
రుహానీ శర్మ(Ruhani Sharma) కీలక పాత్రలో శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్ర హెర్(Her). రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి సంయుక్తంగా నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇందులో రుహానీ శక్తిమంతమైన ఓ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు.
అలా ఇలా ఎలా
దర్శకుడు పి.వాసు కుమారుడు శక్తి వాసుదేవన్ హీరోగా రాఘవ తెరకెక్కించిన చిత్రం అలా ఇలా ఎలా. కొల్లకుంట నాగరాజు నిర్మాత. నాగబాబు, బ్రహ్మానందం, అలీ, నిషా కొఠారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించారు. ఈ సినిమా జులై 21న థియేటర్లలోకి రానుంది. సప్సెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుందని మూవీ యూనిట్ తెలిపారు.
కాజల్ కార్తిక
బ్యూటిఫుల్ హీరోయిన్స్ కాజల్ ఆగర్వాల్(Kajal Aggarwal), రెజినా కస్సండ్రా(Regina cassandra) నటించి మూవీ కాజల్ కార్తిక(Kajal Karthika). ఈ చిత్రికాన్ని డేకే దర్శకత్వం వహించారు. జనర్థాన్ నిర్మించిన ఈ చిత్రం జులై 21 ప్రేక్షకుల ముందుకు రానుంది.
జిలేబి
శ్రీ కమల్, శివాని రాజశేఖర్ నటించిన తాజా ఫిల్మ్ జిలేబి. నటకీరిటి రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో నటించారు. కె విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 21న విడుదల అవుతుంది. అలాగే నాతో నేనే, నాగద్వీపం అనే రెండు సినిమాలు కూడా ఇదే రోజు విడుదల అవుతున్నాయి.