కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'లియో' పై నెగెటివ్ వైబ్ కనిపిస్తోంది. ఈ సినిమా పోస్టర్స్‌తో డిసప్పాయింట్ అయిన అభిమానులు.. ఇప్పుడు ట్రైలర్‌తో థియేటర్‌నే ధ్వంసం చేశారు.
If you don't like 'Leo'... theaters will be destroyed!
Leo: విజయ్, లోకేష్ కనగరాజ్ ‘లియో’ సినిమా స్టార్ట్ అయినప్పుడు లోకేష్ యూనివర్స్‌లో భాగంగానే వస్తుందని సంబరపడిపోయారు విజయ్ ఫ్యాన్స్. మాస్టర్ సినిమా మాదిరి గానే లియో సినిమాను సోలోగా కొత్త స్టోరీతో తెరకెక్కిస్తున్నట్టే ఉన్నాడు లోకేష్. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే ఇది కరెక్టేనని అనిపిస్తోంది. విజయ్ ఫ్యాన్స్ కూడా లియో ట్రైలర్ నచ్చలేదని అంటున్నారు. ఎందుకంటే.. చెన్నైలో రోహిణి థియేటర్ మొత్తాన్ని ద్వంసం చేశారు దళపతి ఫ్యాన్స్. లియో ట్రైలర్ ప్రదర్శించిన తర్వాత ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా అదుపు తప్పి థియేటర్లో చైర్స్, ఫర్నీచర్ మొత్తం నాశనం చేశారు. దీనికి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ట్రైలర్ నచ్చకపోవడం వల్లే విజయ్ ఫ్యాన్స్ ఇలా చేసినట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలోను లియో ట్రైలర్లో వావ్ ఫ్యాక్టర్ లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇది సినిమా ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. ట్రైలర్ నచ్చకపోతేనే ఇంత రచ్చ చేస్తే.. ఇక సినిమా రిజల్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా.. థియేటర్స్ తగలబెట్టేస్తారేమోనని చైన్నైలోని కొన్ని థియేటర్ యాజమాన్యాలు భయపడుతున్నాయి. ట్రైలర్‌తో లక్షల్లో థియేటర్‌కు నష్టం వాటిల్లింది. కాబట్టి.. లియో రిలీజ్ రోజు రచ్చ ఇంకెలా ఉంటుందో చూడాలి. మాస్టర్ వంటి ఫ్లాప్ తర్వాత విజయ్‌కు సాలిడ్ హిట్ ఇవ్వాలని లియో సినిమా చేస్తున్నాడు లోకేష్. కానీ ట్రైలర్ మాత్రం కాస్త డిసప్పాయింట్ చేసిందంటున్నారు. మరి అక్టోబర్ 19న రానున్న లియో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.