Sangeeth: సితార ఎంటర్టైన్మెంట్ నుంచి వచ్చిన తాజా చిత్రం MAD ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ఫుల్ కామెడీ జోనర్లో మూవీ సాగుతోంది. చిత్ర కథనం కొంచెం నిరాశ మిగిల్చింది అనే మాటలు వినపడుతున్నాయి. మూవీలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన హీరో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ అనే కుర్రాడు.
ఫ్రేమ్ జీరో నుంచి, DD అకా దామోదర్ పాత్రలో సంగీత్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడని చెప్పొచ్చు. అతను డైలాగ్స్ చెప్పిన విధానం, అద్భుతమైన కామెడీ టైమింగ్ అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. అన్ని సన్నివేశాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. అతను ఇలాగే లీడ్ రోల్స్ చేస్తూనే ఉంటే, కొన్నాళ్లుగా మనం వెండితెరపై మిస్సయిన పాతకాలపు అల్లరి నరేష్‌కి ఖచ్చితంగా అతను తదుపరి ప్రత్యామ్నాయం అవుతాడు అనే నమ్మకం కలుగుతోంది. మరి ఇలానే కామెడీ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటాడో, లేక ట్రాక్ తప్పి, వేరే జోనర్స్ ప్రయత్నిస్తాడో చూడాలి. ఏది ఏమైనా నటనలో అన్నకు తగిన తమ్ముడు అని నిరూపించుకున్నాడు.
సంగీత్ వెండి తెర మీదే ఇదే మొదటి సినిమా. వెబ్ సిరీస్‌లతో ముందుగా ఆకట్టుకున్నాడు. బ్యూటీ అండ్ బేకర్స్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వంటి వెబ్ సిరీస్ లలో నటించి, ఆకట్టుకున్నాడు. మరి ఫ్యూచర్ లో ఎలాంటి సినిమాలు ఎంచుకుంటాడో చూడాలి.