ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎదిగిన వారిలో హీరో రవితేజ (Ravi Teja) ఒకరు. చిన్న పాత్రలతో ఆయన సినీ కేరీర్ ప్రారంభించారు. నేడు రూ.100కోట్ల హీరోల లిస్ట్‌లో చేరి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. ఈ స్థాయికి రావడానికి ఆయన చాలా ఇబ్బందులే పడ్డారని గతంలో చెప్పారు. అయితే, నటుడు అనుపమ్‌ఖేర్ తాజాగా చెప్పిన ఓ సంఘటన రవితేజపై ఆయన అభిమానులకు గౌరవం మరింత పెరిగేలా చేసింది.
రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో టాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) కీలక పాత్రలో కనిపించునున్నారు.ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ముంబై(Mumbai)లో జరిగిన ఈవెంట్లో రవితేజ, అనుపమ్ మధ్య ఆసక్తికర సన్నివేశం జరిగింది. చిన్న వయస్సులో రవితేజ తన స్టూడియోకి వచ్చి నాతో ఫోటో దిగాలని అడిగారు. నేను కుదరదని చెప్పా. ఇన్నేళ్ల తర్వాత ఆయన సినిమాలోనే నటిస్తున్నాని ఆరోజు అలా అన్నాందుకు రవితేజకు సారీ చెబుతున్నా అని అనుపమ్ నవ్వులు పూయించారు.ఈ సంభాషణంతా సరదాగానే జరిగినప్పటికీ రవితేజ అభిమానులు మాత్రం ఆయన్ని తెగ పొగిడేస్తున్నారు. ‘
అప్పుడు ఫొటో కోసం వెళ్లారు. ఇప్పుడు తన సినిమాలోనే ఛాన్స్ ఇచ్చారు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఇక రవితేజకు ‘టైగర్ నాగేశ్వరరావు’ మొదటి పాన్ ఇండియా (India) చిత్రం కానుంది. ఆయన సరసన నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించారు. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో రూపొందింది. ఇందులో హేమలత లవణం అనే సమాజ సేవకురాలి పాత్రలో రేణూ దేశాయ్ (Renu Desai) కనిపించనున్నారు. అక్టోబర్ 20న ఈ చిత్రం అన్ని భాషల్లోనూ విడుదల కానుంది.