ఆదిపురుష్ సినిమా పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అందుకే టీజర్ రిలీజ్ చేయకముందు ఆదిపురుష్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూశారు డార్లింగ్ ఫ్యాన్స్. అయితే టీజర్ రిలీజ్ అయ్యాక.. అందరికీ ఆదిపురుష్ టార్గెట్ అయిపోయాడు. గ్రాఫిక్స్ పరంగా ఈ సినిమా పై దారుణమైన ట్రోలింగ్ జరిగింది. గ్రాఫిక్స్ దెబ్బకు సినిమాను ఏకంగా ఆరునెలలు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. విజువల్ పరంగా మంచి ఔట్ పుట్ కోసం మరింత సమయం కావాలంటూ.. జూన్ 16కు ఆదిపురుష్‌ను వాయిదా వేశాడు దర్శకుడు ఓం రౌత్. ఈ క్రమంలో రీషూట్ చేయబోతున్నారని.. గ్రాఫిక్స్‌తో కలిపి 100 కోట్లు అదనంగా ఖర్చు పెట్టబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆదిపురుష్ ఓవర్సీస్ గురించి చర్చ మొదలైపోయింది.
ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ సరిగమ సినిమాస్ వారు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఓవర్సీస్లో భారీ సినిమాలు రిలీజ్ చేయడంలో సరిగమ సంస్థదే పై చేయి. అందుకే ఆదిపురుష్ మేకర్స్‌తో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. పైగా త్రీడి మూవీ.. ప్లస్ ఇంగ్లీష్‌లోను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఆదిపురుష్ ఓవర్సీస్ రైట్స్ కోసం భారీ మొత్తంలో చెల్లించబోతున్నట్టు సమాచారం. ఇదే జరిగితే ఆదిపురుష్‌కు ఓవర్సీస్లో మరింతగా కలిసొస్తుందని అంటున్నారు. ఎందుకంటే.. ఆదిపురుష్ రిలీజ్ సమయంలో కొన్ని హాలీవుడ్ సినిమాలు రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి. కాబట్టి.. సరిగమ వారు ఆదిపురుష్ రైట్స్ దక్కించుకుంటే.. థియేటర్స్ పరంగా అమెరికాలో ఎలాంటి ప్రాబ్లమ్ లేదంటున్నారు. ఇదే జరిగితే.. ఓవర్సీస్‌లోను ఆదిపురుష్ భారీ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందంటున్నారు.