»Hindu Sena Files Petition Against Adipurush Movie
Adipurushపై హైకోర్టులో పిటిషన్..ఆ సీన్లు దారుణంగా ఉన్నాయని వెల్లడి
ఆదిపురుష్ మూవీపై ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదైంది. హిందువుల విశ్వాసాలు దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయని హిందూ సేన అంటోంది. వాటిని సినిమా నుంచి తొలగించాలని ధర్మాసనాన్ని కోరింది.
Adipurush Movie: ప్రభాస్ ఆదిపురుష్ (Adipurush) మూవీని కష్టాలు వీడటం లేదు. సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో హిందూ సేన పిటిషన్ దాఖలు చేసింది. ఆదిపురుష్ (Adipurush) మూవీ నిన్న రిలీజ్ కాగా.. ఫస్ట్ డే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నెగిటివ్ రివ్యూలు రాగా.. నెగిటివివీ ఎక్కువగా వినిపించింది. బాయ్ కాట్ ఆదిపురుష్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. పలు సీన్లపై అభ్యంతరం తెలిపారు. మూవీపై నేపాలీలు ఆగ్రహాం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హిందూ సంస్థలు సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు కోర్టును ఆశ్రయించాయి.
భారతీయులకు శ్రీరాముడు, సీత, హనుమంతుడి గురించి నిర్దిష్ట ఆలోచణ ఉందని హిందూ సేన అంటోంది. సినిమా ఆ ఆలోచనను మార్చే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. అందులోని సన్నివేశాలు హిందూ సంస్కృతిని అవమానించేలా ఉన్నాయని తెలిపారు. దేవుళ్లను తప్పుగా చూపించే ప్రయత్నం జరిగిందని అంటున్నారు. ఇదీ హిందువుల హక్కులను ఉల్లంఘించడమేనని తెలిపారు. పాత్రలకు సంబంధించిన దుస్తులు, హెయిర్ స్టైల్, పర్సనాలిటీ, బాడీ షేప్‌కు సంబంధించి స్పష్టమైన సూచనలు ఉన్నాయి. అన్నింటిని వక్రీకరించారని.. ఇది హిందూ స్ఫూర్తిని దెబ్బతీసిందని చెప్పారు. ఆ తప్పులను సరిదిద్దమని సినిమా నిర్మాత, దర్శకుడిని ఆదేశించాలని కోర్టును కోరారు.
చరిత్రను వక్రీకరించి మత స్వేచ్ఛ, ఆచారానికి విఘాతం కలిగిస్తోందని, చర్యలు తీసుకోవాలని కోరారు. రామాయణంలోని అరణ్యకాండ, ఉత్తరకాండ విభిన్నంగా తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. ఇప్పటివరకు చూసిన రావణ, వానర సేన, శ్రీరాముని వర్ణనలను విభిన్నంగా చూపించే ప్రయత్నం చేశారని అంటున్నారు. దీనిని హిందువులు జీర్ణించుకోలేరని చెబుతున్నారు. రావణుడి సైన్యాన్ని రాక్షసుల సైన్యంగా, వానర సైన్యాన్ని చింపాంజీలుగా చూపించారని కూడా తెలిపారు.
Was this movie #Adipurush shot inside a dark room with a Chinese mobile camera? ₹600 they say has been spent, was it for laundering!!
సినిమాలో శ్రీరాముడిని జీసస్‌లా చూపించారని.. సీతామాత వేషధారణ తీరుపై ఓ నెటిజన్ విమర్శలు చేశారు. మూవీలో రామాయణాన్ని వక్రీకరించారని.. సినిమాను బాయ్ కాట్ చేసి.. సనానత ధర్మాన్ని కాపాడాలని మరొకరు కోరారు. మూవీలో మేఘనాధుడు సీత గొంతును కోసే సీన్ చూపించగా.. రామాయణంలో అదీ ఎక్కడ ఉంది. నిర్మాత భూషణ్ కుమార్ ఏం చేశాడని మరొకరు ప్రశ్నించారు. ఇది ఎలాంటి రామాయణం.. తప్పుడు సీన్లను ఎలా తీస్తారని అడిగారు. హారర్ మూవీలో డార్క్ థీమ్‌లో సినిమా చూపించారని విమర్శలు వచ్చాయి.