»Hi Nanna Trailer Release The Sentiment Of Father And Daughter Is A Different Lever
Hi Nanna Trailer : ‘హాయ్ నాన్న’ ట్రైలర్ రిలీజ్..తండ్రీకూతుర్ల సెంటిమెంట్ వేరే లెవర్
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న హాయ్ నాన్న మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ మధ్య ఈ మూవీ సాగనుందని ట్రైలర్లో తెలుస్తోంది. ప్రేమ, ఎమోషన్స్ మధ్య సాగే ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల కానుంది.
నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న 30వ సినిమా హాయ్ నాన్న (Hi Nanna ). ‘దసరా’ లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత నాని చేస్తోన్న సినిమా ఇది. కొత్త దర్శకుడు శౌర్యువ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తోంది. శృతిహాసన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో ఈ మూవీ సాగనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ (Trailer Release) చేశారు.
హాయ్ నాన్న ట్రైలర్:
ట్రైలర్ అదిరిపోయింది. నాని తన కూతురికి కథలు చెబుతుంటాడు గానీ తన తల్లి గురించి మాత్రం చెప్పడు. దీంతో ఆ కూతురు తన తల్లి గురించి తెలుసుకోవాలనే ఆశ అలాగే ఉండిపోతుంది. ఆ సమయంలో అందర్నీ తన తల్లి గురించి అడుగుతూ నానికి విసుగు తెప్పిస్తుంది. అప్పుడే నాని తన కథను చెబుతాడు. ఆఖరికి కథ విన్న నాని కూతురు కన్నీళ్లతో తన తండ్రిని ఆ కథ చెప్పొద్దని చెప్పేస్తుంది.
నాని, తన కూతురితో జీవితాన్ని గడిపేస్తుండగా వారి లైఫ్ లోకి మృణాల్ ఎంట్రీ ఇస్తుంది. మృణాల్ కూడా నాని వైఫ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అసలు నాని లైఫ్ లో ఏం జరిగింది? అసలు తన కూతురికి తల్లి ఉందా? లేదా? నాని లైఫ్ లోకి మృణాల్ వస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. డిసెంబర్ 7వ తేదీన హాయ్ నాన్న మూవీ విడుదల కానుంది. ప్రేమ, ఎమోషన్స్, ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్స్ మధ్య సాగే ఈ మూవీ ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసిందని చెప్పాలి.