కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ హీట్ అనే సినిమా(HEAT Movie) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. H.E.A.T ఎ సైకో మైండ్ వర్సెస్ ఎ బ్రోకెన్ హార్ట్ అంటూ వస్తోన్న ఈ సినిమాతో వర్ధన్, స్నేహా ఖుషిలు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.
టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీకి ఈ మధ్యకాలంలో చాలా మంది కొత్త హీరోలు, హీరోయిన్లు పరిచయం అవుతున్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు కూడా. కొత్త కథాంశంతో సరికొత్త సినిమాలు ప్రేక్షకులకు దగ్గరవుతున్నాయి. ఓటీటీ(OTTs)లు వచ్చాక ఈ కల్చర్ ఇంకాస్త ఎక్కువైంది. తాజాగా కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ హీట్ అనే సినిమా(HEAT Movie) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. H.E.A.T ఎ సైకో మైండ్ వర్సెస్ ఎ బ్రోకెన్ హార్ట్ అంటూ వస్తోన్న ఈ సినిమాతో వర్ధన్, స్నేహా ఖుషిలు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.
‘హీట్’ మూవీ ట్రైలర్ రిలీజ్:
https://www.youtube.com/watch?v=SpAu1o2RktI
ఈ మూవీని వర్మ, సంజయ్ నిర్మిస్తున్నారు. అర్జున్, శరత్ వర్మలు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి చిత్ర యూనిట్ ట్రైలర్ ను రిలీజ్(Trailer Release) చేసింది. ట్రైలర్ ను బట్టీ ఇదొక మర్డర్ మిస్టరీ చుట్టూ సాగే కథ(Murder Mystery Story)లా కనిపిస్తోంది. హంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్న సీన్స్ ను కట్ చేసి ట్రైలర్‌గా రిలీజ్(Trailer Release) చేశారు.
హీట్ మూవీ(HEAT Movie)లో హంతకుడు ఎవరు? ఎందుకు హత్య(Murders)లు చేస్తుంటాడనే అనే కథాంశం ప్రధానంగా సాగుతుందని ట్రైలర్ (Trailer)ను చూస్తే తెలుస్తోంది. ఆటలో గెలవాలంటే ఆడటం మాత్రమే తెలిస్తే సరిపోదని, ప్రత్యర్థులను సరిగ్గా అంచనా వేయాలనే డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీని మే 5వ తేదిన రిలీజ్(Release) చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.