»Have Rajamouli And Mahesh Babu Seen The Movie Animal
Rajamouli: రాజమౌళి, మహేష్ ‘యానిమల్’ సినిమా చూశారా? లేదంటే నచ్చలేదా?
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్లో దూసుకుపోతోంది అనిమల్ సినిమా. ఫస్ట్ వీకెండ్లో 563 కోట్లు రాబట్టి.. ఎనిమిది రోజుల్లో 600 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది అనిమల్ సినిమా. కానీ రాజమౌళి, మహేష్ బాబు అనిమల్ విషయంలో హాట్ టాపిక్ అవుతున్నారు.
యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర తన ఏంటో చూపాడు సందీప్ రెడ్డి వంగ. సెకండ్ వీక్‌లోకి ఎంటర్ అయినా కూడా ఏ మాత్రం స్లో అవ్వట్లేదు యానిమల్. అయితే ఈ సినిమాకు ఎంత కలెక్షన్స్ వస్తున్నాయో.. అదే రేంజ్లో విమర్శలు కూడా వస్తున్నాయి. నార్త్‌లో యానిమల్ సినిమాపై నెగటివ్ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఏకంగా పార్లమెంట్లో కూడా యానిమల్ సినిమా పై రచ్చ జరిగింది. ఇదో ‘ఏ’ రేటెడ్ సినిమా అని చాలామంది పెదవి విరుస్తున్నారు. కానీ అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా హీరోలు మాత్రం ఈ సినిమాకు అదిరిపోయే రివ్యూలు ఇస్తున్నారు.
సినిమా చూసిన తర్వాత చిత్ర యూనిట్ మొత్తాన్ని పేరు పేరున అభినందిస్తూ ట్వీట్ చేసాడు అల్లు అర్జున్. కానీ రాజమౌళి, మహేష్ బాబు మాత్రం యానిమల్ పై ఎలాంటి రివ్యూలు గానీ, ట్వీట్ గానీ వేయలేదు. ఈ ఇద్దరు యానిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి వచ్చి భారీ హైప్ క్రియేట్ చేశారు. అంతేకాదు.. యానిమల్ సినిమాను తాను ఒకరోజు ముందే చూస్తున్నానని చెప్పాడు రాజమౌళి. కానీ జక్కన్న ఈ సినిమాను చూశాడా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదు.
ఒకవేళ యానిమల్ సినిమాను చూసి ఉంటే.. ఎక్కడో ఓ చోట లీక్ అయ్యేది. పోనీ లీక్ కాకుండా సినిమా చూస్తే.. కనీసం ఒక్క ట్వీట్ కూడా ఎందుకు వేయలేదు? అనేది అర్థం కానీ విషయమే. దర్శక ధీరుడికి సినిమా నచ్చలేదా? అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. జక్కన్నతో పాటు మహేష్ బాబు నుంచి కూడా యానిమల్ విషయంలో ఎలాంటి రెస్పాన్స్ లేదు. అసలు ఈ ఇద్దరు అనిమల్ సినిమాని చూడలేదా? లేక చూసినా నచ్చలేదా? అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. మరి ఇప్పటికైనా సినిమా చూసి రాజమౌళి, మహేష్‌లు ట్వీట్ చేస్తారేమో చూడాలి.