మామూలుగా అయితే పెద్ద హీరో సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. చిన్న సినిమాలు పోస్ట్ పోన్ అవుతుంటాయి. కానీ టీజర్ కూడా స్టార్ హీరో కోసం వాయిదా వేసుకోవడం విశేషమనే చెప్పాలి. అయితే ఇదే ఇప్పుడు ఆ సినిమాకు మరింత పబ్లిసిటీ తీసుకొస్తోంది. అది కూడా ప్రభాస్ లాంటి హీరో పేరుతో టీజర్ ఆపేస్తున్నమంటూ చెప్పడంతో.. ఆ సినిమాకు మరింత కలిసొచ్చేలా ఉంది. అ, కల్కి, జాంబిరెడ్డి వంటి వైవిధ్యమైన సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
ప్రస్తుతం తేజ సజ్జ హీరోగా ‘హనుమాన్’ అనే ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఆదిపురుష్ కోసం ఈ సినిమా టీజర్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. దసరా సందర్భంగా అక్టోబర్ 2న, ప్రభాస్ రాముడిగా నటిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. హనుమాన్ టీజర్‌ను దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. కానీ.. ఏకంగా రాముడు వస్తున్నారని తెలిసింది.. అందుకే ‘హనుమాన్’ ఆగిపోయారని.. అప్పటి వరకు ప్రభాస్ ‘ఆదిపురుష్’ను చూద్దామంటూ తెలిపాడు ప్రశాంత్ వర్మ. దాంతో ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. మొత్తంగా ప్రశాంత్ వర్మ సరైన సమయంలో ప్రభాస్ పేరు ప్రస్థావించి..’హనుమాన్’ పై మంచి హైప్ తీసుకొచ్చాడని చెప్పొచ్చు. మరి ఆదిపురుష్‌తో పబ్లిసిటీ మొదలు పెట్టి.. రాముడికి వెల్కమ్ చెబుతున్న హనుమాన్ ఎప్పుడొస్తారో చూడాలి.