Jr.NTR : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఎట్టకేలకు మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎన్టీఆర్30 గ్రాండ్ లాంచ్ అయింది. ఆచార్య ఫ్లాప్, ఆర్ఆర్ఆర్, ఆస్కార్, తారకరత్న మరణం.. ఇలా ఎన్నో అవోరోధాలని దాటుకొని ఎన్టీఆర్ 30 సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఎట్టకేలకు మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎన్టీఆర్30 గ్రాండ్ లాంచ్ అయింది. ఆచార్య ఫ్లాప్, ఆర్ఆర్ఆర్, ఆస్కార్, తారకరత్న మరణం.. ఇలా ఎన్నో అవోరోధాలని దాటుకొని ఎన్టీఆర్ 30 సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
హైదరాబాద్‌లో ఎన్టీఆర్ 30 చిత్ర యూనిట్‌తో పాటు, రాజమౌళి, ప్రశాంత్ నీల్లు ముఖ్య అతిథులుగా ఈ ముహూర్త కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అనిరుధ్, రత్నవేలు, శ్రీకర్ ప్రసాద్, సాబు సిరిల్, దిల్ రాజు ఈ ముహూర్త కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ పూజా కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. రాజమౌళితో ఎన్టీఆర్, జాన్వీ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. దీంతో నందమూరి అభిమానులు గాల్లో తేలుతున్నారు. సోషల్ మీడియాలో NTR 30 ట్రెండింగ్‌లో ఉంది. త్వరగా షూటింగ్ మొదలుపెట్టాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. మార్చి 29 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.
ఇప్పటికే పోర్ట్ బ్యాక్ డ్రాప్ కోసం భారీ సెట్టింగ్స్ వేశారు. ఫస్ట్ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నారు. ఈసినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. జనతా గ్యారేజ్ తర్వాత.. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇదే. దాంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి.
ఈసారి బౌండరీలు దాటి సినిమా చేస్తున్నానని కొరటాల చెబుతున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ ఎన్టీఆర్ 30కి మరింత ప్లస్ కానుంది. మరి ఈ సినిమాతో తారక్, కొరటాల ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.