Ramabanam: ఓపెన్ చేస్తే కలకత్తా ప్యాలెస్, హౌరాబ్రిడ్జ్ ను చూపిస్తూ కొన్ని కార్లు ఎయిర్ పోర్ట్ కు బయలు దేరుతాయి. కారులోంచి హీరో విక్కి దిగి చార్టెడ్ ఫ్లైట్ ఎక్కుతాడు. ఈ క్షణం ఈ ప్రయాణం నేను ఊహించింది కాదు, ప్లాన్ చేసింది కాదు, నా డెస్టినీ నా డెస్టినేషన్ ను డిసైడ్ చేసింది. లైఫ్ లో మళ్లీ వెళ్లను అనుకున్న చోటుకు నన్ను పంపిస్తుంది. అనే హీరో వాయిస్ ఓవర్ తో కథ మొదలౌతుంది. ఎందుకెల్తున్నానో, ఎక్కడికెళ్తున్నానో చెప్పాలంటే అసలు నా ప్రయాణం ఎక్కడ మొదలైందో చెప్పాలి అంటూ రఘుదేవపురం అనే ఊర్లో సుఖీభవ అనే ఆర్గానికి పద్దతిలో నడిపే హోటల్ ను చూపిస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాన్సిప్ట్ తో ఎరువులు వాడకుండా పండించడం, లాభాలు ఆశించకుండా కడుపునింపడం అనే కాన్సెప్ట్ తో నడుపుతున్న హోటల్ అది. దాన్ని విక్కి అన్న రాజారామ్, వదిన భువన, బాబాయ్ నడుపుతుంటారు. దాంతో ఆ హోటల్ కు మంచి పేరుతో పాటు కస్టమర్లు ఎక్కువగా వస్తుంటారు. మంచి ఉన్న చోట చేడు కూడా ఉంటుందని ఎదురు హోటల్ ఓనర్ పాపరావుకు గిరాకీ లేకపోవడానికి కారణం ఈ సుఖీభవ హోటల్ అని, అక్కడికి వచ్చి రేట్లు పెంచండి అని వార్నింగ్ ఇస్తాడు. పెంచేంత వరకు తన దగ్గరే ఉంటుందని హోటల్ లైసెన్స్ ను తీసుకొని వెళ్లిపోతాడు. ఆ సమయంలో విక్కికి కోపం వస్తుంది. తన కోపాన్ని వదిన భువన కంట్రోల్ చేస్తుంది. నిజాయితీ పరుడైన రాజారామ్ పోలీసు స్టేషన్ కు వెళ్లి పాపారావు మీద కంప్లైంట్ ఇస్తాడు. కట్ చేస్తే పాపారావు, ఎస్ఐ ఇద్దరు కూర్చోని మందు కొడుతుంటారు. మార్నింగ్ రాజారామ్ ఇచ్చిన కంప్లయింట్ పేపర్లో పల్లీలు పట్టుకొస్తాడు ఎస్ఐ. దాన్ని చూసి పాపారావు నవ్వుతాడు. అంతలో అక్కడికి విక్కి ఒక లాంతర్ తో వచ్చి వాళ్లు కూర్చున్న గోడౌన్ లో విసురుతాడు. అది కాలిపోతుంది. కట్ చేస్తే విక్కినే ఇది చేసిందని రాజారామ్ కు తెలిసి ఇలాంటివి చేయడానికి చట్టాలు, కోర్టులు ఉన్నాయని, చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలని విక్కిని స్టేషన్ కు తీసుకెళ్తాడు. మధ్యలో రైల్వే స్టేషన్ రాగానే విక్కి అన్న నుంచి పారిపోయి ట్రైన్ ఎక్కుతాడు.
చదవండి:Sudhir Babu ఇంత దారుణమా? రెండు వారాలకే ఓటీటీ బాట!
నెక్ట్స్ సీన్లో విక్కి కలకత్తాలో దిగుతాడు. గొప్పవాడు కావాలి అన్న ఆలోచన తప్ప ఎలా అనేది తెలియక ఆలోచిస్తూ ఒక చోట కూర్చుంటాడు. అదే సమయంలో వీధి బాలులకు తినడానికి ఆహారం ఇప్పిస్తున్న గుప్త అనే వ్యక్తి విక్కిని పిలిచి తనను కూడా తినమని చెప్తాడు. దానికి విక్కి నేను పని చేయనిదే తినను అంటాడు. అది నచ్చి గుప్త తనతో పాటు పనిచేయడానికి తీసుకెళ్తాడు. ఆ సమయంలో కలకత్తా ముఖర్జీ అనే ఒక డాన్ చేతులో ఉంటుంది. అన్ని దందాలు తనే చేస్తుంటాడు. ఆ సమయంలో ముఖర్జీకి ఎదురెళ్లి ఒక బెడ్డింగ్ వేయడానికి గుప్త ముందుకెళ్తాడు. కట్ చేస్తే ముఖర్జీ మనుషులు, గుప్తను బిడ్డింగ్ వేయకుండా ఆపుతారు. ఆ సమయంలో విక్కి డబ్బున్న బ్యాగ్ ను తీసుకొని హౌరా బ్రిడ్జ్ నుంచి నీటిలో దూకుతాడు. తరువత సీన్లో బిడ్డింగ్ జరిగే సమయంలో దగ్గరపడుతుంది. విక్కి పారిపోయాడు అని గుప్తతో ముఖర్జీ అంటాడు. అదే సమయంలో డబ్బుతో వస్తాడు విక్కి అలా గుప్తకు పార్ట్ నర్ గా మారుతాడు.
నైట్ టైమ్ కలకత్తాలో ఒక కారుకు ఎదురుగా విక్కి బైక్ ఆపుతాడు. ఆ కార్లో ఉన్న వ్యక్తులు ఒక పోలీసు ఫ్యామిలీని చంపేస్తారు. కట్ చేస్తే ఆ విలన్లను చంపేస్తాడు విక్కి. సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ లో విలన్ చేసే దందాలు, అన్యాయాన్ని ఎదిరిస్తూ విక్కి ఆ నేరసామ్రాజ్యంలో హీరోగా ఎదుగుతుంటాడు. అదే దందాలో ముఖర్టీ కొడుకు కూడా ఇన్వాల్వ్ అవుతాడు. అందరితో ఫైట్ చేస్తూ ముఖర్జ్ కొడుకును కొడుతాడు. ముఖర్జి గుప్తకు వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే అలా నేరసామ్రజ్యంలో హీరోగా ఎదుగుతున్న విక్కిని ప్రేమలో పడేస్తుంది బైరవి. పూలా గుత్తిలా కనిపిస్తూ అనే లవ్ సాంగ్ స్టార్త్ అవుతుంది.
బైరవి వెనుకాల తిరుగుతూ తన ప్రేమను చెబుతుంటాడు హీరో. పాట ముగిసేలోపు ఇద్దరు ప్రేమలో డీప్ గా మునిగిపోతారు.
కట్ చేస్తే బైరవి నాన్న విక్కితో మాట్లాడుతుంటాడు. ప్రేమించుకోవడానికి మీరిద్దరు చాలు, కాని పెళ్లి అంటే రెండు కుటుంబాలు కావాలని మీ పెద్ద వాళ్లతో మాట్లాడాలి అంటాడు. దానికి విక్కి సింగిల్ గా ఉంటుంన్నట్లు తన ఫ్రెండ్స్ చెబుతారు. దానికి బైరవి ఫాదర్ ఎన్ని డబ్బులు ఉన్నా ఒంటరిగా ఉండేవాడు ఒక అనాద అని, నీ లాంటి అనాదకు తన కూతుర్ని ఇవ్వలేనని చెప్తాడు. ఆ మాటలకు తాను అనాద కాదని చిన్నప్పుడే గొడవపడి బైటకి వచ్చినట్లు చెప్తాడు. దాంతో బైరవి తండ్రి తన కుటుంబంతో మాట్లాడాలి అని కండిషన్ పెడుతాడు. ఈ కారణంగా విక్కి తన అన్నయ్య దగ్గరకు బయలుదేరుతాడు. కాని తాను కలకత్తలో చేసిని పనులను దాచిపెట్టాలి అనుకుంటాడు.
కట్ చేస్తే అమృత నిలయంలో రాజారామ్ పూజ చేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో విక్కి ఇంట్లోకి అన్నయ్య అంటూ అడుగుపెడుతాడు. కుటుంబం అంతా ఆశ్చర్యపోతూ అలా నిలుచుండిపోతారు. రాజరామ్ దగ్గరకు వచ్చి విక్కిని ఎమోషనల్ గా హగ్ చేసుకుంటాడు. 14 ఏళ్ల తరువాత నా ప్రాణం తిరిగి వచ్చిందని రాజారామ్ ఎమెషనల్ అవుతారు. వదిన భువన ఎమోషనల్ గా డైలాగులు చెప్తూ చెప్పమీద కొట్టి ఏడుస్తుంది. తరువాత తన బాబాయ్ తో విక్కి రూమ్ చూడడానికి వెళ్తాడు. ఆ సమయంలో అన్నయ్యకు తన గతం గురించి చెప్పద్దు అనుకుంటాడు విక్కి.
నెక్స్ట్ సీన్లో సావిత్రి పిల్లలకు సంగీతం క్లాసులు చెప్తాడు. ఆ సమయంలో పురుషోత్తం కొంబరిబోండాలో వైన్ కలుపుకొని తాగుతుంటాడు. తన పేరు సావిత్రి అని విక్కికి పరిచయం చేస్తాడు బాబాయ్. అదేంటి సావిత్రి అని విక్కి అడుగుతాడు. దానకి వెంకటేష్ తులసి అని పెట్టుకోలేదా… అల్లు అర్జున్ పుష్ప అని పెట్టుకోలేదా అది పేరు కాదండి ఫైర్ అని చెబుతాడు. తరువాత విక్కి కలకత్తాలో ఏం చేస్తుంటాడు అని అడిగుతాడు రాజారామ్. విక్కి అబద్దం చెప్పి మ్యానేజ్ చేస్తాడు. అదే సమయంలో వదిన చేసని వంట బాగుందని, యూట్యూబ్ లో పెడుదామని చెప్తాడు. కట్ చేస్తే కలకత్తలో ఉన్న విక్కి అస్టిస్టెంట్స్ ఫోన్ చేస్తారు. నువ్వు కలకత్తాలో లేవని తెలసి ముఖర్జీ తన మనుషులతో కాలిఘట్ లో దాడి చేశాడని చెప్తారు. తరువాత వదిన యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నట్లు బైరవితో కలిసి మీరు రాండి అని అంటాడు విక్కి. అదే సమయంలో రాజారామ్ వచ్చి తనతో మాట్లాడలని అంటాడు. అలా కాసేపు మాట్లాడుకుంటారు. రాజారామ్ స్థాపించిన సుఖీభవ హోటల్స్ ప్రపంచవ్యాప్తంగా విస్తిరించినందుకు సంతోషపడుతారు.
కట్ చేస్తే రాజారామ్ చైర్లో కూర్చొని ఆలోచిస్తాడు. ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఫుడ్ కమిషనర్ ఛైర్మెన్ గా ఉన్నా రాజారామ్ దగ్గరకు పాపారావుతో కలిసి తన అల్లుడు జీకే వచ్చి తన ఫుడ్ ప్రొడక్ట్స్ లైసెన్స్ పై సంతకం ఎందుకు పెట్టలేదని అడుగుతాడు. దానిలో క్వాలిటీ లేదని అందుకే చేయలేదని చెప్తాడు. ఆ ఘటనతో రాజారామ్ కు శత్రువులు ఏర్పడుతారు. ఆ విషయాన్ని విక్కి దగ్గర దాచాలని అన్నయ్య చూస్తారు. నెక్ట్స్ సీన్లో కలకత్తా నుంచి బైరవి అండ్ బ్యాచ్ క్యాబ్ దిగుతారు. వారితో పురుషోత్తమ్ మాట్లాడుతుంటాడు. అలా వారిని తీసుకొని ఇంట్లో వారికి పరిచయం చేస్తాడు విక్కి. బైరవిని జనని తీసుకొని వెళ్తుంది. ఇద్దరు అసిస్టెంట్లను విక్కి తీసుకెళ్తుంటే వాయిలెన్ బాక్స్ కింద పడుతుంది. దానిలో గన్ ఉంటుంది. అది సావిత్రి తన అసిస్టెంట్ చూసి చూపించండి అని కామెడీ చేస్తారు.
కట్ చేస్తే వంటల ప్రొగ్రామ్ స్టార్ట్ చేస్తారు. అది కామెడీగా ఉంటుంది. బైరవిని అందరూ మెచ్చుకుంటారు. తరువాత నైట్ సీన్లో బైరవికి విక్కి ఫోన్ చేసి పైకీ రమ్మాంటాడు. తరువాత ఇద్దరూ కిస్ చేసుకుంటుంటే వదిన చూసి ఫ్యామిలీని పిలిస్తుంది. వీరు ప్రేమించుకున్న విషయాన్ని వదినకు చెప్తాడు. అన్నయ్యను ఒప్పించమని అడుగుతాడు. నెక్ట్స్ సీన్లో అన్నయ్యకు చెప్తాడు. అంటే మా కోసం కాదు నీ ప్రేమ కోసం వచ్చావు అని కొంత సస్పెన్స్ ఇచ్చి స్మైల్ ఇస్తూ.. బైరవి అమ్మనాన్నలను రమ్మను మాట్లాడుదాం అని చెప్తాడు. ఐఫోన్ చేతుల పట్టి పాట స్టార్ట్ అవుతుంది.
సాంగ్ తరువాత సీన్లో విక్కి ఇంట్లోకి కొంత మంది చొరబడుతారు. ఇల్లంత వెతుకుతారు. ఆ సీన్లోకి విక్కి ఎంటర్ అవుతాడు. వాళ్లతో ఫైట్ జరుగుతుంది. అది వాళ్ల అన్నయ్యకు తెలియకుండా కవర్ చేస్తుంటాడు. దానికి తన అసిస్టెంట్స్ కూడా హెల్ప్ చేస్తారు. అంతలో అక్కిడికి వదిన కూడా వస్తుంది. వాటర్ కోసం వచ్చినట్లు కవర్ చేస్తాడు. ఆ విలన్లను తరిమి తరిమి కొడుతాడు విక్కి. ఆ గొడవలో కొన్ని శబ్దాలు వస్తాయి. దాంతో కుటుంబం అంతా పరిగెత్తుకుంటూ వస్తారు. అక్కడ గన్ ను దాచిపెడుతాడు విక్కి. ఫ్యామిలీని పంపించిన తరువాత తన ఫ్రెండ్స్ తో.. ఇలా గొడవలు జరుగుతాయని తెలసే ఇన్ని రోజులు ఇంటికి రాలేదని చెప్తాడు. వాళ్లు ఇది ముఖర్జీ ప్లాన్ అని అనుకుంటారు. మరో వైపు ఇది కచ్చితంగా జీకే ప్లానే అని రాజారామ్, బాబాయ్ మాట్లాడుకుంటారు. ఈ గొడవల వలన విక్కి డిస్టర్బ్ అవడం తనకు ఇష్టం లేదని, కొన్ని రోజులు ఊరెళ్లి వద్దాం అని, దాని కోసం శ్రీ లక్ష్మీనరసింహాస్వామి యాగం చేయాలని వెళ్తారు. దరువైరా సాంగ్ వస్తుంది. సాంగ్ అవగానే విక్కి అసిస్టెంట్స్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బీహరి గ్యాంగ్ వచ్చింది మీ కోసం కాదు మీ అన్నయ్య కోసం అని చెప్తారు. జీకే కు రాజారామ్ కు మధ్య గొడవలు అవుతున్నట్లు జీకే ఫుడ్ ప్రొడక్ట్స్ కు సైన్ చేయకపోవడం వలనే ఇదంతా జరుగుతున్నట్లు చెప్తారు. ఈ విషయంలో పోలీసులు, పొలిటీమన్లు కూడా జీకే వైపే ఉన్నట్లు తెలియజేస్తారు. అసలు జీకే ఎవుడు అని విక్కి తెలుసుకుంటాడు. పాపా రావు అల్లుడే ఈ జీకే అని నిజం తెలుస్తుంది. అదే సమయంలో పాపారావు ఎంట్రీ ఉంటుంది.
ఈ యాగంలోనే నీకు స్పాట్ పెట్టినట్లు రాజారామ్ తో చెప్తాడు. సైన్ పెట్టమని బెదిరిస్తాడు. విషయం తెలుసుకున్న విక్కి రంగంలోకి దిగుతాడు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని లేపెయ్యాలను కుంటాడు. పూజారి వేశంలో ఉన్న గుండాలను కొడుతుంటాడు. వంటశాలలో ఉన్న విలన్లను అగ్నితో ఫైట్ చేస్తాడు. రైస్ మిల్ దగ్గర వేశాలు వేసుకుంటున్న విలన్లను చీల్చిచండాడుతాడు. వాళ్లందరిని చితకబాధింది విక్కి అని తెలుస్తుంది పాపారావుకు. అన్నయ్య అంటే తనకు ఎంత ప్రేముందో చెబుతూ.. ఇంకోసారి తన అన్న జోలికి వస్తే చంపెస్తా అని ఇదే విషయాన్ని తన అల్లుడికి చెప్పు అని వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా జీకే కెమెరాలతో చూస్తుంటాడు. అన్నదమ్ములు ఇద్దరు కలిసి యాగం పూర్తి చేస్తారు. అదే సమయంలో విక్కి ఇల్లు మంటలు వ్యాపిస్తాయి.
కట్ చేస్తే జీకే పాపారావు మాట్లాడుకుంటారు. అసలు వాడికి తమ్ముడు ఉన్నాడని ఎందుకు చెప్పలేదు అని, విక్కి గురించి మొత్తం తెలుసుకోవాలి అని వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే రాజారామ్ ఇంటికి లాయర్ వచ్చి ఆనాదాశ్రమం విషయంలో మీరు జైల్ కు వెళ్లే అవకాశం ఉందని ఒక సారి జడ్జిని కలుద్దామని వెళ్తారు. ఇంట్లోకి వచ్చి వదిన దేవుడికి మొక్కుతూ ఏడుస్తుంది. అక్కడికి విక్కి వచ్చి అసలు విషయం ఏంటని అడుగుతాడు విక్కి. ఫ్లాష్ బ్యాక్.. ఆర్గానిక్ వ్యవసాయం గురించి ఒక సామావేశంలో రాజారామ్ మాట్లాడుతుంటాడు. ఆ సమయంలో జీకే తన ప్రోడక్ట్స్ ను అమ్మడానికి పర్మిషన్ ఇవ్వడు. మీడియాతో జీకే ఫుడ్ ఎవరు వాడకండి అని చెప్తాడు రాజారామ్. దాంతో జీకే మార్కెట్ పడిపోతుంది. రాజా రామ్ మీద జీకే కోపంతో ఉంటాడు. అదే సమయంలో జనని పెళ్లి కుదురుతుంది. ఆ సంతోషంలో సుఖీభవ హోటల్ నుంచి ఆనాదాశ్రమానికి ఫుడ్ పంపిస్తారు. అది తిన్న పిల్లలకు ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఈ సంఘటనలో పిల్లలు చాలా మంది ఆస్పత్రిలో చికిత్సపొందుతుంటారు. అదేసమయంలో సుఖీభవ హోటల్ పౌ రైడ్ జరుగుతుంది. అందులో అన్ని కల్తీ సరకులు ఉన్నాయని రాజారామ్ ను జైల్ కు తీసుకెళ్తారు. బెయిల్ మీద బయటకు వచ్చిన రాజారామ్ ను జీకే బెదిరిస్తాడు. దానికి రాజారామ్ బెదిరింపులకు భయపడడు. అదే సమయంలో జనని ఎంగేజ్మెంట్ కాన్సెల్ అవుతుంది. ఈ విషయాలను తెలుసుకున్న విక్కి అన్నయ్యకు చెప్పద్దొని వదిన దగ్గర మాట తీసుకుంటాడు.
తరువాతి సీన్లో ప్రదీప్ కు జనని ఫోన్ చేస్తుంది. అతను లిఫ్ట్ చేయడు. అక్కడికి వచ్చిన విక్కి జననితో రేపు అక్కడికి వేళ్దాం అని చెప్తాడు. కట్ చేస్తే 50 కోట్ల కోసం ఆ పెళ్లిని వద్దన్నందుకు అతనికి 50 కోట్లు సెటిల్ చేస్తాడు విక్కి. తరువాత రుద్రప్రతాప్ తో మాట్లాడుతాడు. అతను ఫ్రాడ్ చేసినట్లు చెప్పి బెదిరిస్తాడు. విక్కి మాటలకు భయపడి రుద్రప్రాతాప్ వెళ్లిపోతాడు.
నెక్ట్స్ సీన్లో జనిని పెళ్లి మళ్లీ ఫిక్స్ అయిందని అందరూ సంతోషంలో ఉంటారు. అదే శుభకార్యానికి భైరవి ఫ్యామిలిని కూడా పిలుద్దాం అంటాడు హీరో. తరువాత సీన్లో గన్ ఉన్న వాయిలెన్ కనిపించడం లేదని గెటప్ సీన్ కంగారు పడుతూ చెప్తాడు. కట్ చేస్తే ఆ వాయిలెన్ సావిత్రి దగ్గర ఉంటుంది. అందరి ముందు దాన్ని వాయించడానికి సిద్దం అవుతూ ఒపెన్ చేయగానే అందులో గన్ ఉంటుంది. సావిత్రి వణికి పోతాడు. అసలేం అయిందని ఫ్యామిలీ అంతా భయపడుతుంటారు. అంతలో కరెంట్ పోతుంది. కట్ చేస్తే సావిత్రి చేతులో వాయిలెన్ ఉంటుంది.
మరో సీన్లో బైరవి ఫ్యామిలీ వస్తారు. రెండు కుటుంబాలు మాట్లాడుకుంటాయి. తరువాత సీన్లో రాజారామమ్, విక్కి మాట్లాడుకుంటున్నప్పుడు పురుషోత్తం వచ్చి విక్కిని అడుగుతాడు. నీ లాంటి సూపర్ వైజర్ ను అంత రిచ్ ఫ్యామిలీ ఎలా ఒప్పుకున్నారు అని, దానికి తన ప్రేమను చూసి అలాగే తనకు కలకత్తాలో కార్లు, విల్లాలు లేవని చెప్తాడు. అది సప్తగిరి విని అన్ని అబద్దాలు చెబుతున్నాడని ఎలాగైన ఈ నిజాన్ని అందరికి చెప్పాలి అనుకుంటాడు. కట్ చేస్తే విక్కి తన అసిస్టెంట్స్ సప్తగిరి కామెడీ సీన్ ఉంటుంది. సప్తగిరిని అందరు కలిసి కన్ ఫ్యూజ్ చేస్తారు.
తరువాత సీన్లో ప్రదీప్ జననిల నిశ్చితార్థం జరుగుతుంది. కట్ చేస్తే రాజారామ్, బైరవి కుటుంబాలు మాట్లాడుకుంటాయి. తంబులాలు పుచ్చుకోవడానిక ప్లాన్ చేసుకుంటారు. మొనలిసా మొనలిసా సాంగ్ వస్తుంది. పాట అయిపోగానే జీకే పాపారావులు రవింద్ర కోసం వెయిట్ చేస్తుంటారు. అక్కడికి రవింద్ర వచ్చి విక్కి గురించి అన్ని విషయాలను తెలుసుకున్నట్లు చెప్తాడు. వాడి పేరు తెలియనవాడు కలకత్తాలో ఎవడు లేరని. పేరు చెప్పగానే వాడి గురించి అన్ని చెబుతున్నారంటే వాడు ఎంత ఫేమసో మీరే తెలుసుకోండి అని అంటాడు. అలా కలకత్తాలో విక్కి బాయ్ గురించి చెప్తాడు. కాలిఘట్ లో కాలనీ వాసుల ఇళ్లను కాపాడి వారి దృష్టిలో విక్కి బాయ్ అయినట్లు చెప్తాడు. దాంతో విషయం తెలుసుకున్న పాపారావు భయపడుతుంటాడు. ఒక్క పూట అన్నం పెట్టినందుకే కాలిఘట్ ప్రజలకు అంత చేశాడు అంటే, సుఖీభవ హోటల్ ను తగలబెట్టి, వాళ్ల అన్నయ్యను జైల్ కు పంపించినందుకు నిన్ను ఏం చేస్తాడో అని జీకేతో పాపారావు అంటాడు. అంతలో అక్కడికి విక్కి వస్తాడు. జీకే విక్కి ఇద్దరు ఒకరినొకరు వార్నింగ్ ఇచ్చుకుంటారు.
విషం తీసుకున్న పిల్లలు ఇంకా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని అలసు వారు తీసుకున్న పాయిజన్ ఏంటో తెలిస్తే ట్రీట్ మెంట్ ఈజీ అవుతుందని డాక్టర్ చెప్తాడు. ఎయిమ్స్ నుంచి డాక్టర్లను తీసుకొస్తున్నట్లు చెప్తాడు. రాజారామ్ వెళ్లగానే విక్కి వచ్చి లాయర్ ను కలుస్తాడు. అసలు విషయం ఏంటని ఆరా తీస్తాడు. ఆ మీటింగ్ లో మహేష్ అనే ఒక సైంటిస్ట్ గురించి చెప్తాడు. జీకే ఫుడ్స్ లో అడల్ట్రేటర్ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇక్కడ వాడుతున్నారని. బ్రైయిన్ పనిచేయకుండా పనిచేసే చైనా సాల్ట్ ను కూడా జీకే వాడుతున్నట్లు మహేష్ చెప్తాడు. తరువాత రైట్ టైమ్ లో కలుస్తా అని చెప్పి మహేష్ వెళ్లిపోతాడు. అప్పటి నుంచి అతను కనిపించలేదు అని లాయర్ చెప్తాడు.
తరువాత సీన్లో విషం కలిసిన రోజు ఫుడ్ వండిన మనుషులను తీసుకొని బాబాయ్ వస్తాడు. వారితో విక్కి మాట్లాడుతాడు. ఫుడ్ తీసుకెల్లాల్సిన అతని కూతరుకు ఆక్సిడెంట్ కావడంతో.. ఆశ్రమానికి ఫుడ్ తీసుకెల్లింది బయల్ రాజ్ అని తెలుసుకుంటాడు. యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని విక్కిని కలుసుకొని అసలు విషయం తెలుసుకుంటాడు. ఇదంత చేయించింది బయల్ రాజ్ అనే నిజం బయటపడుతుంది.
కట్ చేస్తే ముఖర్జీకి, జీకే ఫోన్ చేసి విక్కికి ఒక ఫ్యామిలీ ఉందని, తన కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని విక్కిని చంపొచ్చని చెప్తాడు. కట్ చేస్తే ముఖర్జీ హైదరాబాద్ కు వస్తాడు. జీకే ను కలుస్తాడు. అదే సమయంలో బయల్ రాజ్ కాల్ చేసి విక్కికి అంతా తెలిసిపోయింది అని చెప్తాడు. వెంటనే బయల్ రాజును రమ్మని జీకే చెప్తాడు. ఇదే విషయాన్ని రాజారామ్ శ్రేయోభిలాషుడిగా విక్కికి ఫోన్ చేసి బయల్ రాజ్ ఉన్న అడ్రెస్ చెప్పి జీకే మనుషులు అతన్ని చంపేయబోతున్నట్లు చెప్తాడు. వెంటనే విక్కి అక్కడికి బయలుదేరుతాడు. అదే సమయంలో ఈ విషయాన్ని రాజారామ్ కు ఫోన్ చేసి చెప్తాడు. అక్కడికి విక్కి రావాడానికి ముందే బయల్ రాజ్ ను జీకే మనుషులు కొడుతుంటాడు. విక్కి రాగానే బయల్ రాజ్ నన్ను కోర్టుకు తీసుకెళ్లండి నిజం చెప్తా అంటాడు. అక్కడ ఫైట్ జరుగుతుంది. అక్కడికి ముఖర్జీ అండ్ తన బ్యాచ్ వస్తారు. వాళ్లతో విక్కి ఫైట్ జరుగుతుంది. బయల్ రాజ్ రవింద్ర పొడుస్తాడు. అక్కడికి రాజారామ్ వస్తాడు అది చూసి విక్కి అని అరుస్తాడు. కలకత్తాలో విక్కి చేసిన పని తెలుసుకుంటాడు.
కట్ చేస్తే విక్కి గురించి నిజాలు చెబుతూ రాజారామ్ బైరవి కుటంబాన్ని వెళ్లిపో అంటాడు. కుటుంబ అంతా బాధా పడుతుతూ కూర్చొని ఉంటే విక్కి వస్తాడు. అన్నదమ్ములు ఇద్దరు విలువ గురించి, నేటి సమాజం గురించి మాట్లాడుకుంటారు. విక్కి మాటలకు కన్విన్స్ అవని రాజారామ్ విక్కిని ఇంట్లో నుంచి వెళ్లిపో అంటాడు. మీకు కష్టం వచ్చినప్పుడు నేను ఉండడం అది నా హక్కు అంటూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అన్నం తినలానుకుంటాడు విక్కి. ఇప్పటి వరకు ఈ ఇంట్లో ప్రేమల గురించి మాట్లాడుకున్నాం నువ్వు కొత్తగా హక్కు అంటున్నావు.. అయితే మేమే వెళ్లిపోతాము అని రాజారామ్ అనే సరికి విక్కి కోపం, బాధతో వెళ్లిపోతాడు. ఫ్యామిలీ అంతా బాధపడుతుంది. విక్కి ఒంటరిగా వెళ్లిపోతాడు. రామబాణం అనే ఎమోషనల్ సాంగ్ వస్తుంది.
చదవండి:‘Ganjai Shankar’గా సాయి ధరమ్ తేజ్?
సాంగ్ అయిపోగానే బాబాయ్ రక్తంతో ఇంటికి వచ్చి భువనకు జరిగిందంత చెబుతాడు. పిల్లలకు బాగలేదని పొద్దున్నే ఫోన్ వచ్చి ఆసుపత్రికి వెళ్తే.. అక్కడ జీకే మనుషలు వచ్చి రాజారామ్ ను తీసుకెళ్లినట్లు చెప్తాడు. ఆ రోజు కోర్టులో ఫైనల్ హీయరింగ్ ఉంటుంది. దాంతో విక్కికి ఫోన్ చేస్తుంది. విషయం తెలుసుకున్న విక్కి వదినతో కలిసి కమిషనర్ ఇంటికి వెళ్తారు. అక్కడ పాపారావు కూడా ఉంటాడు. వాళ్లతో మాట్లాడితే రాజారామ్ పారిపోయాడు అని పాపారావు చెబుతాడు. నువ్వు ఏం చేస్తావో తెలియదు పదిన్నరకు కోర్టుకు అన్నయ్యతో కలిసి రా అని భువన వెళ్లిపోతుంది. తరువాత పాపారావును కొట్టి జీకే, రాజారామ్ ఉన్న ఫ్యాక్టరీలో తీసుకెళ్తాడు విక్కి. అక్కడ రాజారామ్ ను దెబ్బలు తిని ఉంటాడు. అక్కడ ఫైట్ జరుగుతుంది. విక్కినే కరెక్ట్ అని తెలుసుకున్న రాజారామ్ కూడా ఫైట్ చేస్తాడు. కట్ చేస్తే కోర్టులో అందరూ హాజరు అవుతారు. సాక్ష్యాలు అన్ని జీకేకి ఎగనెస్ట్ గా ఉంటాయి. రేపటి తరానకి మంచి ఫుడ్ అందించడం చాలా ముఖ్యమని జడ్జ్ తీర్పు ఇస్తూ ఇన్ని తప్పులు చేసిన జీకేకు శిక్షవేస్తాడు. కథ సుఖాంతం అవుతుంది.