»Good News For Movie Lovers Movie In Multiplex For Rs 99
PVR offer: మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. రూ.99కే మల్టీప్లెక్స్‌లో సినిమా
సినిమా బిజినెస్‌లో అతిపెద్ద మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ సంస్థ తాజాగా మూవీ లవర్స్ కోసం సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. దీంతో ప్రేక్షకులు సంతోషపడుతున్నారు.
Good news for movie lovers.. Movie in multiplex for Rs.99
PVR offer: మూవీ బిజినెస్‌లో పీవీఆర్ మల్టీప్లెక్స్ సంస్థ ప్రేక్షకులను ఆకర్శించడానికి అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తుంది. తాజాగా మరో ఆఫర్‌తో పీవీఆర్ ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 23 న సినిమా లవర్స్ డే అన్న విషయం అందరికి తెలిసిందే. దీన్ని పురస్కరించుకుని కేవలం రూ.99కే సినిమా చూసే అవకాశం కల్పించింది. పీవీఆర్ మల్టీఫ్లెక్స్ స్క్రీన్లలో ఏ సినిమాకైనా ఇది వర్తిస్తుంది. ఈ మేరకు పీవీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
అయితే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో మాత్రమే వర్తిస్తుంది. తెలంగాణ ప్రేక్షకులకు రూ.112లకు నిర్ణయించింది. గత రెండేళ్లలో నేషనల్ సినిమా డే నాడు ఈ ఆఫర్లను ప్రకటిస్తుంది. ఇప్పుడు ఇదే రేటుకు INOX మల్టీప్లెక్స్‌లు కూడా ఈ శుక్రవారం ఆఫర్ తీసుకరాబోతున్నాయి. అయితే ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్‌పై ఈగల్, ఊరుపేరు భైరవకోన సినిమాలతో పాటు సుందరం మాస్టారు, సిద్దార్థ్ రాయ్, మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా నీలో, సైరన్, ఆర్టికల్ 370, మమ్ముట్టి భ్రమయుగం వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.