»Get Ready Taman Special Song For Mahesh Babu Fans
Guntur curry: గెట్ రెడీ.. మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం తమన్ స్పెషల్ సాంగ్!
గుంటూరు కారం సినిమా పాటల విషయంలో తమన్‌ను ఓ రేంజ్లో ట్రోల్ చేశారు మహేష్ బాబు ఫ్యాన్స్. కానీ థియేటర్లో గుంటూరు కారం సినిమా చూసిన తర్వాత తెగ ఎంజాయ్ చేశారు. దీంతో ఇప్పుడు తమన్ మహేష్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ సాంగ్ రిలీజ్‌కు రెడీ అవుతున్నాడు.
Guntur curry: సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమా డివైడ్ టాక్‌తో 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సినిమా టాక్, కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే మహేష్ బాబుని చూసి పండగ చేసుకున్నారు అభిమానులు. గుంటూరు కారంలో అదరగొట్టేశాడు మహేష్ బాబు. ముఖ్యంగా బాబు బీడి స్టైల్‌కి, కుర్చీ మడతబెట్టి సాంగ్‌కు థియేటర్ బూజులు దులిపేశారు. ఈ సినిమా నుంచి మొత్తం ఆరు పాటలు రిలీజ్ అయ్యాయి. సినిమా రిలీజ్‌కు ముందు దమ్ మసాలా, ఓ మై బేబీ, మావా ఎంతైనా పర్లేదు, కుర్చీ మడతబెట్టి సాంగ్స్ రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ అయ్యాక రమణ ఏయ్, అమ్మ సాంగ్ బయటికొచ్చింది. ఇందులో కొన్ని పాటల విషయంలో తమన్ పై విమర్శలు వచ్చినప్పటికీ.. థియేటర్లో ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోసం తమన్ మరో సూపర్ సాంగ్ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు.
సోషల్ మీడియాలో గుంటూరు కారం ఆల్బమ్ షేర్ చేస్తూ.. ఒక సాలిడ్ ప్రామిస్ చేశాడు. గుంటూరు కారంలో ఇప్పటికే ఉన్న ఆరు ట్రాక్‌లతో పాటు, మహేష్ బాబు డైహార్డ్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ఒక పాటను సిద్ధం చేస్తున్నట్టుగా తెలిపాడు. ఇది ఘట్టమనేని ఫ్యాన్స్‌కి మాస్ ట్రీట్‌లా ఉంటుందని ప్రామిస్ చేశాడు. దీంతో సినిమాలో లేని ఈ అడిషనల్ సాంగ్ ఎలా ఉంటుందనేది ఎగ్జైటింగ్‌గా మారింది. తమన్ ఇంతలా ప్రామిస్ చేశాడంటే.. గుంటూరు కారం నుంచి మరో మాస్ బీట్ వస్తుందనే చెప్పాలి. మరి ఈ కొత్త సాంగ్ మహేష్ ఫ్యాన్స్ చేత మాస్ డ్యాన్స్ చేయిస్తుందేమో చూడాలి.