E.G: జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వేదిక కావాలని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ అన్నారు. బుధవారం యూనివర్సిటీ ఈసీ హాల్లో నిర్వహించిన యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సమావేశంలో ఆమె మాట్లాడారు. క్రీడాకారులకు అవసరమైన వనరులు, వసతులను సమకూర్చి వారి ప్రతిభను ప్రోత్సహించాలని సూచించారు.