SRPT: విద్యార్థులు సమస్యలను, ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం సాధ్యమని ఎస్పీ నరసింహ అన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ మంచి ఆశయం, లక్ష్యం ఉండాల న్నారు. ప్రావీణ్యం ఉన్న అంశంపై సాధన చేయాలని చెప్పారు. డీఎస్పీ ప్రసన్నకుమార్ సీఐ వెంకటయ్య ఉన్నారు.