»Animal Park Is More Than That Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga: ‘అనిమల్ పార్క్’ అంతకుమించి ఉంటుంది
అర్జున్ రెడ్డి తర్వాత అనిమల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. వైలెన్స్ సినిమా చేస్తానని చెప్పి మరీ.. ఏ రేటెడ్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. దీంతో అనిమల్ పార్క్ అంతకు మించి అనేలా ఉంటుందని చెబుతున్నాడు.
'Animal Park' is more than that.. Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga: అనిమల్ సినిమాలో అసలు సిసలైన వైలెన్స్ చూపించిన సందీప్ రెడ్డి వంగ.. ఇంటర్వెల్ సీన్‌కు పిచ్చెక్కించాడు. ఇక క్లైమాక్స్‌లో అబ్రార్‌ను చంపేసిన తర్వాత.. అతని తమ్ముడు చేసే అరాచకం ఎలా ఉంటుందో జస్ట్ శాంపిల్‌గా చూపించి.. సీక్వెల్‌గా అనిమల్ పార్క్ అనౌన్స్ చేశాడు. అనిమల్ పార్క్‌లో రణబీర్‌ని మరింత వైల్డ్‌గా ప్రెజెంట్ చేయబోతున్నట్టుగా చెప్పేశాడు సందీప్ రెడ్డి. ‘ఇస్తాంబుల్‌లో ఉండే అనిమల్కి, ఢిల్లీలో ఉండే రన్ విజయ్ సింగ్ మధ్య జరిగే వార్ పీక్స్‌లో ఉండబోతోంది. అంటే రణబీర్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తూ.. రణబీర్ vs రణబీర్ వార్‌గా సీక్వెల్ రూపొందనుంది. ఇద్దరు వైల్డ్ అనిమల్స్ లాంటి మనుషులు కొట్టుకుంటే ఎలా ఉంటుందో? ఊహకందకుండా ఉంది. ఆ వైలెన్స్ చూసి ఆడియెన్స్ తట్టుకుంటారా? సందీప్ రెడ్డి చేయబోయే ఆ అరాచకం గురించి ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నారు. అందుకు తగ్గట్టే లేటెస్ట్ అప్టేట్ అంచనాలను పెంచేసేలా ఉంది.
తాజాగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు కారక్రమంలో అనిమల్ పార్క్ గురించి చిన్న హింట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి. 69వ ఎడిషన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024లో అనిమల్ చిత్రానికి అవార్డుల పంట పండింది. ఏకంగా ఐదు విభాగాల్లో అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా.. అనిమల్ పార్క్ ఎలా ఉంటుందని అడగ్గా.. మరింత క్రేజీగా, బిగ్గర్గా ఉంటుందని.. అంతకుమించి చెప్పలేనని చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి. దీంతో అనిమల్ పార్క్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అసలే సందీప్ రెడ్డి వంగ వైలెన్స్ అంటే ఏంటో చూపిస్తానని చెప్పి మరీ సినిమాలు చేస్తుంటాడు. అలాంటిది.. అనిమల్ పార్క్ అంతకుమించి అంటున్నాడు అంటే, మామూలుగా ఉండదనే చెప్పాలి. మరి అనిమల్ పార్క్ ఎలా ఉంటుందో చూడాలి.