పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పవర్ ఫుల్ గ్యాంగ్ డ్రామా ఓజి రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా? అంటే, ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. దాదాపుగా ఇదే డేట్‌కు ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ థియేటర్లోకి రావడం పక్కా అంటున్నారు.
OG release date: ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాల్లో ఓజి పై భారీ అంచనాలున్నాయి. ప్రభాస్ ‘సాహో’ తర్వాత యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా ఫస్ట్ గ్లింప్స్ సినిమా పై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పవన్ పాలిటిక్స్ కారణంగా ప్రస్తుతం షూటింగ్ బ్రేక్‌లో ఉంది ఓజి. దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే క్లారిటీ లేకుండా పోయింది. కానీ తాజాగా ఓజి రిలీజ్ డేట్ లాక్ అయినట్టుగా తెలుస్తోంది. ముందు నుంచి ఓజి మూవీ ఈ ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని వినిపించింది. ఇప్పుడు సెప్టెంబర్ 27న లాంగ్ వీకెండ్ కలిసి వచ్చేలా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే పవన్ లేని సీన్స్ కంప్లీట్ చేశాడు సుజీత్. పవన్ ఓ 15 రోజులు డేట్స్ ఇస్తే చాలు.. షూటింగ్ కంప్లీట్ అయిపోతుందట. ఏపి ఎన్నికలు అయిపోగానే పవన్ డేట్స్ ఇస్తే వెంటనే ఓజిని పూర్తి చేసి అనుకున్న సమయానికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రియాంక ఆరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. చివరగా బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్.. ఈ ఏడాదిలో ఓజిగా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.