HNK: కాజీపేట మండలం మడికొండ ZP ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు గేమ్స్‌లో జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. 10వ తరగతి విద్యార్థినులు కే.కీర్తన, రీతు, 9వ తరగతి విద్యార్థిని శ్రీజ, ఉష్ స్కూల్ గేమ్స్‌లో అండర్ 17 విభాగంలో సత్తాచాటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఉపాధ్యాయ సిబ్బంది వారిని అభినందించారు.