NDL: ఆత్మకూరు పట్టణం ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి ఏ.రణదీర్ డిమాండ్ చేశారు. బుధవారం మున్సిపల్ కార్యాలయం ముందు సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేసి, ఏఈ ఓబులేష్కు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. వివిధ కాలనీల్లో నెలకొన్న డ్రైనేజీ, రోడ్లు, వీధిలైట్లు వంటి సమస్యలు పరిష్కరించాలని కోరారు. నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.