కోనసీమ: రామచంద్రాపురం ముచ్చుమిల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో వీధి వ్యాపారుల సాధికారత కోసం గురువారం ప్రత్యేక మేళా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ KVRR రాజు తెలిపారు. ఈ మేళాలో వ్యాపారులకు గుర్తింపు కార్డులు, రుణ దరఖాస్తుల స్వీకరణ, డిజిటల్ చెల్లింపులపై శిక్షణ ఇస్తారని చెప్పారు. ఇందులో అవగాహన, బ్యాంకుల ద్వారా రుణాలు, ప్రత్యేక వైద్య శిబిరాలు వంటివి ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు.