WGL: రైతుల వద్ద పండిన ప్రతీ గింజను ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు. బుధవారం WGL కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. 2025-26 వానాకాలం సీజన్ వరి ధాన్యం సేకరణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, అక్టోబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు.