రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ చిత్రం నుంచి ఒక సాంగ్ లీక్ అయింది. ఆ పాట నెట్టింటిలో హల్ చల్ చేయగా.. నిర్మాత దిల్ రాజు లీక్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Gamechanger: రామ్‌చరణ్ (Ramcharan) – శంకర్(Shankar) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer). కియారా అడ్వాణీ హీరోయిన్గా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు(Dil Raju) సినిమాను నిర్మిస్తున్నారు. జరగండి జరగండి అనే పాట సోషల్ మీడియాలో లీకైంది. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రిలో హాట్ టాపిక్ అయింది. వెంటనే అన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. సాంగ్ లీక్ కావడంపై నిర్మాత దిల్‌రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. పాటను లీక్ చేసిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. వాట్సాప్‌తోపాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో పాట షేర్ చేసిన వారిపైనా కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
పొలిటికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథాంశంతో గేమ్ ఛేంజర్ తెరకెక్కుతున్నట్లు సమాచారం. రామ్‌చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. తమన్ స్వరాలు అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ కూడా నెట్టింట లీకయ్యాయి. ఇక సాంగ్ కూడా లీక్ అవడంతో చిత్ర నిర్మాత తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు.