బాలీవుడ్ బాద్ షా షారుక్‌కు తన తోటి హీరోలు అంటే చిన్నచూపు.. అవును ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మూవీ ప్రాజెక్ట్ కే (కల్కీ) గురించి హీరీయిన్ దీపికా పదుకునే మాట్లాడుతుండగా.. షారుక్ మొహం మాడిపోయి కనిపించింది.
Prabhas: బాహుబలి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). పాన్ ఇండియా స్టార్‌గా నిలిచారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ అంతగా ఆడకున్న ప్రభాష్.. ఫ్యాన్ ఫాలొయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇటీవల వచ్చిన ఆదిపురుష్ మూవీ కూడా ఆకట్టుకోలేదు. వసూళ్ల పరంగా ఓకే కానీ.. ఫ్యాన్స్ మాత్రం ఖుషీ కాలేదు.
ఏ ఫీల్డ్‌లో అయినా పోటీ ఉంటుంది. ఇటీవల షారుక్ ఖాన్ జవాన్ మూవీ వచ్చింది. హిట్ టాక్ అందుకుంది. కలెక్షన్లు విషయంలో దుమ్ములేపుతోంది. ఈ ఏడాది పఠాన్ మూవీ రాగా.. ఇప్పుడు జవాన్ కూడా హిట్ అయ్యింది. ఆ మూవీ సక్సెస్ మీట్లో షారుక్‌తో నటి దీపికా పదుకొనే మాట్లాడారు. సందర్భంలో ప్రాజెక్ట్ కే (కల్కీ) మూవీ గురించి దీపికా ప్రస్తావించారు. ఆ మూవీలో దీపికా హీరోయిన్ రోల్ చేస్తోంది. కల్కీ గురించి ప్రస్తావించగానే షారుక్ మొహం మాడిపోయింది. ఆ ఫోటో/ వీడియో చూపిస్తూ డార్లింగ్ ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు.
ప్రభాస్ (Prabhas) మూవీ గురించి దీపికా చెబితే షారుక్ అభద్రతా భావానికి గురయ్యాడని ఫ్యాన్స్ అంటున్నారు. మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఇన్ సెక్యూర్‌గా ఫీల్ అయ్యే నటుడు ఇక జన్మించడు.. షారుక్ బకరా ఉన్నాడు కదా అని స్ట్రాంగ్ కామెంట్ చేశారు. షారుక్‌కి ఇంత ఇన్ సెక్యూర్ ఉంటుందని అనుకోలే.. అయినప్పటికీ తన ఫేవరేట్ యాక్టర్ అని మరొకరు రాశారు. ప్రభాస్ సినిమా పేరు చెప్పగానే మొహం మార్చేశావ్ చూడు.. ఇందుకే నిన్ను అభద్రతభావానికి గురయ్యే హల్కా అనేది మని మరొకరు రాశారు.
ఆ పోస్ట్‌కు కొందరు హిందీ నెటిజన్లు కూడా షారుక్ ఇన్ సెక్యూర్‌గా ఫీల్ అయ్యారని రాయడం విశేషం. సో అలా.. షారుక్ సొంత అభిమానుల నుంచి కూడా విమర్శలను ఎదుర్కొంటున్నాడు.