Game of thrones: ఓటీటీల్లోకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ అది కూడా తెలుగులో.. ఎందులోనో తెలుసా.?
గేమ్ ఆఫ్ థ్రోన్స్ (Game of thrones) వెబ్ సిరీస్ లకు ఎంత క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సిరీస లోని క్యారెక్టర్లను విపరీతంగా అభిమానించేవారు ఉన్నారు.
ఇప్పటి వరకూ గేమ్ ఆఫ్ థ్రోన్స్ (Game of thrones) ఇండియన్ భాషల్లో అయితే లేదు. అలాగే మన సౌత్ భాషల్లో అయితే అసలే లేదు. అయితే, ఇప్పుడు ఆ సమస్య ఉండదు. దీనిని ఇండియన్ భాషల్లో తీసుకురానున్నారు. తాజాగా జియో సినిమా గేమ్ ఆఫ్ థ్రోన్స్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక ఈ సిరీస్ ను జియో సినిమాలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. త్వరలో స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేయనుందని సమాచారం. మరి డబ్బింగ్ తర్వాత ఎంత మందికి నచ్చుతుందో చూడాలి.
మొత్తంగా 8 సీజన్లు సాగిన ఈ టీవీ సిరీస్ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే చివరి సీజన్ క్లైమాక్స్ మాత్రం చాలా మంది ప్రేక్షకులను నిరాశ పరిచింది. అప్పటివరకు వచ్చిన సీజన్లతో చివరి సీజన్ పై చాలా అంచనాలు పెరిగాయి. కానీ, ఆ అంచనాలను 8వ సీజన్ మాత్రం చేరుకోలేకపోయింది. ఒక నాలుగో ఎపిసోడ్ మాత్రం ఊపిరి బిగపట్టేంతలా ఉన్నా చివరి ఆరో ఎపిసోడ్ క్లైమాక్స్ మాత్రం డిసప్పాయింట్ చేసింది. ఇక దీనికి ప్రీక్వెల్ గా వచ్చిన ‘హౌజ్ ఆఫ్ ది డ్రాగెన్’ కూడా మంచి విజయం సాధించింది.