virupaksha: విరూపాక్షకు సీక్వెల్.. పోస్టర్ బాగుంది, కానీ హీరో ఎవరు?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ విరూపాక్ష. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. . ఇక సినిమా డైరెక్టర్ కార్తీక్ దండు పేరు మార్మోగిపోతోంది. కొత్త డైరెక్టర్ అయినా, ఎక్కడా తడపడకుండా అతను సినిమా తీసిన విధానికి అందరూ ఫిదా అయిపోతారు. ప్రస్తుతం సినిమా కాసుల వర్షం కురిపించింది.
సాయిధరమ్ కెరీర్ లోనే ఎక్కువ కాసులు కురిపించిన చిత్రంగా విరూపాక్ష నిలిచింది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జోడీగా సంయుక్త మీనన్ నటించింది. ఇక ఈ సినిమాకి కొత్త దర్శకుడు, కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. దర్శకుడు కొత్తవాడైనా ఎక్కడా తడబాటు లేకుండా చాలా బాగా ప్రజెంట్ చేయడంతో, అందరికీ నచ్చేసింది. థియేటర్స్ తో పాటు, ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ రావడం విశేషం. కాగా, ఇప్పుడు ఈ మూవీ కి సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు.
తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. “విరూపాక్ష టీమ్ మళ్లీ వచ్చేస్తుంది. మైథికల్ థ్రిల్లర్ కోసం రెడీగా ఉండండి. ప్రీ ప్రొడక్షన్ పనులు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి” అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. విరూపాక్ష సీక్వెల్ పోస్టర్ లో ముగ్గురు తాడు సహాయంతో రెండు కొండల మధ్య లోయలోకి దిగుతూ క్యూరియాసిటీ పెంచేలా ఉంది. ఈ సినిమాకు కూడా కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తుండగా.. సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా నటీనటుల గురించి ఇంకా తెలియలేదు. అయితే, హీరో సాయిధరమ్ తేజ్ అవునో కాదో క్లారిటీ రావాల్సి ఉంది. మరో వైపు సాయిధరమ్ తేజ్ ఇటీవల పవన్ తో కలిసి బ్రో సినిమాలో నటించాడు. ఈ మూవీ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మరి విరూపాక్ష సీక్వెన్స్ కూడా ఆయనకు కన్ఫామ్ అయితే, ఇప్పట్లో ఈ మెగా మేనల్లుడికి తిరుగు లేదనే చెప్పొచ్చు.