దసరా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు.. నాని మేకోవర్ చూసి అంతా షాక్ అయ్యారు. సాఫ్ట్‌గా కనిపించే న్యాచురల్ స్టార్.. ఊరమాస్ లుక్‌లో దర్వనమిచ్చాడు. ఇప్పటి వరకు ఏ సినిమాలోను నాని ఇంత రగ్గడ్ లుక్‌లో కనిపించలేదు. దాంతో దసరా మూవీ పై ఆటోమేటిక్‌గా అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్‌తో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్‌కు వెళ్లిపోయాయి. శ్రీకాంత్ ఓడెల కొత్త దర్శకుడే అయినా.. టీజర్‌తోనే అసలైన దసరాను చూపించాడు. దాంతో సినిమా విడుదలకు ముందే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. అంతేకాదు.. టాలీవుడ్ బడా బ్యానర్స్ ‘దసరా’ టీజర్ చూసి.. బ్లాంక్ చెక్కులు ఇచ్చినట్టు తెలుస్తోంది. యంగ్ హీరోలు సైతం శ్రీకాంత్‌ను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారట. ఇదే కాదు టీజర్ వచ్చిన తర్వాత దసరా బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే పలు చోట్ల థియేట్రికల్ డీల్ కంప్లీట్ అయిపోగా.. మిగతా చోట్ల భారీ డిమాండ్ ఏర్పడినట్టు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా కోసం గట్టిగానే పోటీపడుతున్నట్లుగా తెలుస్తుంది. నాని కెరీర్లోనే ఈ చిత్రం అత్యధికంగా 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అయినా కూడా రిలీజ్‌కు ముందే థియేట్రికల్, డిజటల్ రైట్స్ కలుపుకొని.. 12 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టిందని అంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత దసరాకు భారీ లాభాలు రావడం ఖాయమంటున్నారు. మార్చి 30న ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. సింగరేణి బ్యాక్ డ్రాప్లో దసరా తెరకెక్కింది. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. సుధాకర్ చెరుకూరి నిర్మించారు.