stars Remuneration : 90ల్లోనే రూ.కోటి రెమ్యునరేషన్ అందుకున్న స్టార్లు ఎవరో తెలుసా?
ఇటీవల కాలంలో స్టార్ హీరోలంతా భారీగా పారితోషికాల్ని అందుకుంటున్నారు. కొందరు వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్లు అందుకుంటున్న వారూ ఉన్నారు. అయితే 1990ల్లో కోటీ రూపాయలంటే చాలా పెద్ద పారితోషకం. దాన్ని అందుకున్న వారు ఉన్నారు తెల్సా.
Remuneration: గతంతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో హీరోల రెమ్యునరేషన్లు భారీగా పెరిగాయి. పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న వారు వంద కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్. అయితే ఇప్పుడు ఇది చాలా సాధారణం అయిపోయింది కానీ గతంలో కోటి రూపాయలంటే చాలా ఎక్కువ. 1990ల్లోనే ఇలా అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకున్న వారిలో మొదటి వారు చిరంజీవి(Chiranjeevi) అనే చెబుతారు.
1990ల్లో ఇలా కోటి రూపాయల పారితోషకం తీసుకోవడం అనేది మొదటి సారి ప్రారంభం అయిందట. 1992లో ప్రముఖ డైరెక్టర్ కే. విశ్వనాథ్ తెరకెక్కించిన ‘ఆపద్బాంధవుడు’ సినిమాకుగానూ మెగాస్టార్ తొలిసారి రూ. 1.25 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నారు. టాలీవుడ్లో అప్పుడాయన టాప్ హీరో. అయితే బాలీవుడ్లో అప్పటికే టాప్లో ఉన్న అమితాబచ్చన్ కూడా దాదాపుగా రూ.90 లక్షలు మాత్రమే పారితోషికం తీసుకునే వారట. ఆ సమయంలోనే చిరంజీవి కోటి రూపాయలు తీసుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించిందట.
చిరంజీవి తర్వాత 90ల్లోనే ఇలా కోటి రూపాయల పారితోషికం తీసుకున్న మరో హీరో కమలహాసన్. 1994లో విడుదలైన ఓ సినిమా కోసం ఆయన కోటి పారితోషకాన్ని తీసుకున్నట్లు సమాచారం. వీరిద్దరే కాకుండా రజనీకాంత్ కూడా కోటి రూపాయల పారితోషకాన్ని అందుకున్నారట. ఇక 90వ దశకం చివరినాటికి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబచ్చన్లు కూడా ఒక్కో సినిమాకు కోటి రూపాయల్ని పారితోషికంగా తీసుకునే వారట.