Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగే.. ఒకటి కాదు రెండు!
ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్. రీ ఎంట్రీ తర్వాత మొత్తం ఆరు సినిమాలు కమిట్ అయ్యాడు పవర్ స్టార్. వీటిలో మూడు సినిమాలు ఇప్పటికే ఆడియెన్స్ ముందుకు వచ్చేశాయి. ఇక మిగతా సినిమాలు మాత్రం ఎలక్షన్స్ తర్వాతే రావొచ్చని అనుకున్నారు. ఇప్పుడు పవన్ తీసుకున్న నిర్ణయంతో ఫ్యాన్స్‌కు పండగేనని అంటున్నారు.
Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లోపు కమిట్ అయిన సినిమాలను పవన్ కంప్లీట్ చేస్తాడా? లేదా? అనే భయం మేకర్స్‌కు తెగ టెన్షన్ పెడుతోంది. పవన్ రాజకీయంగా పూర్తిగా ఎప్పుడు ఫోకస్ చేస్తాడు? అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పటికే మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి ఇకపై అన్ని కార్యకలాపాలు జరుగుతాయని అనౌన్స్ చేశాడు పవన్. పవన్‌తో సినిమాలు చేస్తున్న మేకర్స్ కాస్త భయపడుతున్నారు. రీసెంట్గా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ‘బ్రో’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పవన్ కెరీర్లోనే ఫాస్ట్‌గా షూటింగ్ జరుపుకొని.. వేగంగా థియేటర్లోకి వచ్చిన సినిమాగా బ్రో నిలిచింది. ప్రస్తుత ఏపి రాజకీయమంత ఈ సినిమా చుట్టే నడుస్తోంది.
శ్యాంబాబు చేసిన రచ్చతో ‘బ్రో’ దుమారం లేపుతోంది. ఇదే జోష్‌లో మిగతా సినిమాల పై ఫోకస్ చేస్తున్నాడు పవన్. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ. ఈ సినిమాలన్ని సెట్స్ పై ఉన్నాయి. వీటిలో హరిహర వీరమల్లుని పక్కకు పెడితే.. ఓజి, ఉస్తాద్ సినిమాలను మాత్రం ఎలక్షన్స్‌కు ముందే కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయిపోయాడట పవన్. రీసెంట్గా ఉస్తాద్ డైరెక్టర్ హరీశ్ శంకర్ మంగళగిరికి వెళ్లి పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కలిసి వచ్చాడు. ఆగస్టు 15 నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నాన్ స్టాప్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోమని హరీష్ శంకర్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. మూడు షెడ్యూల్స్‌లో ఈ సినిమాను పూర్తి చేయాలని చెప్పాడట.
మరోవైపు సుజీత్ ‘ఓజీ’ సినిమాను పరుగులు పెట్టిస్తున్నాడు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తైంది. ఇక సెప్టెంబర్ మొదటి వారంలో ఓజీకి 15 రోజులు డేట్స్ ఇచ్చి.. తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేయనున్నాడట పవన్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్స్ లోపు ఈ రెండు సినిమాలు రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట పవన్. దీంతో మేకర్స్ అండ్ పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరి నిజంగానే పవన్ అనుకున్న సమయంలో ఈ సినిమాలను పూర్తి చేస్తాడేమో చూడాలి.