మామూలుగా సినిమాల్లో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి పెద్దగా డిస్కషన్స్ ఉండవు. ముఖ్యంగా ఇండియన్ సినిమాల్లో ఇలాంటివి చాలా తక్కువ. హాలీవుడ్ సినిమాల్లో మాత్రం సెక్స్ సీన్స్ కామన్. ఇక ఓటిటి వచ్చాక సెక్స్ కంటెంట్ బేస్డ్ సినిమాలకు కొదవే లేదు. ఈ క్రమంలోనే వచ్చిన సెక్స్ ఎడ్యుకేషన్ అనే వెబ్ సిరీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు సీజన్ 4 రెడీ అవుతోంది.
Stream: ప్రస్తుతం ఉన్న ఓటిటి సంస్థల్లో అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వరల్డ్ వైడ్‌గా ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్నాయి. సినిమాలకు మించిన బడ్జెట్ అండ్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను అలరిస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్‌లో వచ్చే కంటెంట్ ఓ రేంజ్లో ఉంటాయి. భారీ ఎత్తున వెబ్ సిరీస్‌లను అందిస్తోంది ఈ ఓటిటి దిగ్గజం. అందులో భాగంగా 2019లో స్ట్రీమింగ్ అయిన ‘సెక్స్ ఎడ్యుకేషన్’ ఫస్ట్ సీజన్ సెన్సేషనల్‌గా నిలిచింది. దాంతో సిరీస్‌కు కొనసాగింపుగా సీజన్ 2, సీజన్ 3 తెరకెక్కాయి. ఇవి కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. అందుకే ఇప్పుడు.. ఫైనల్ సీజన్‌తో రాబోతున్నారు. తాజాగా దీనికి సీజన్ 4 అప్డేట్ ఇచ్చింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
ex Education Season 4 is coming soon.. ఈసారి కొత్త ప్రదేశాలు, కొత్త సమస్యలు, సెక్స్ ఎడ్యుకేషన్ 4వ సీజన్లో చూడొచ్చు.. అంటూ అని రాసుకొచ్చారు. అలాగే.. ఈ 4వ సీజన్‌ను సెప్టెంబర్‌లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. దీంతో సెక్స్ ఎడ్యుకేషన్ సీజన్ 4 అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ప్రముఖ బ్రిటిష్ టెలివిజన్ నిర్మాణ సంస్థ ఎలెవన్ ఫీలిమ్స్ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌ను లారీ నన్ రూపొందించారు. ఇందులో ఆసా బటర్ఫీల్డ్, ఎమ్మా మాకీ, న్కుటి గత్వా, కానర్ స్విండెల్స్, తాన్య రేనాల్డ్స్, గిలియన్ ఆండర్సన్, మిమీ కీన్, ఐమీ లౌ వుడ్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. మరి ఈసారి సెక్స్ ఎడ్యుకేషన్ ఫైనల్ సీజన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.